- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి కోతి సాహసం.. బిడ్డను ఎలా రక్షించుకుందో చూడండి!?
తల్లి తమ పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది.

దిశ,వెబ్‌డెస్క్: సృష్టిలో అమ్మ ప్రేమకు మించింది ఏది లేదు. తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తల్లి తమ పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది. అయితే తల్లి ప్రేమ మనుషులు, జంతువుల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ఆమె ప్రేమకు ఏదీ సాటి రాదు. చివరకు దైవం కూడా.. అమ్మ తర్వాతే. తమ పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే ఏ తల్లి భరించలేదు. ప్రాణాలకు తెగించి మరీ తమ బిడ్డలను కాపాడుకుంటుంది. ఈ తరుణంలో తాజాగా జంతువుల్లోని మాతృప్రేమ కు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్న తన బిడ్డను తల్లి కోతి ఎలా కాపాడిందో చూస్తే మీరు కూడా హ్యాట్సాప్ చెబుతారు.
వైరల్ వీడియోలో ఉన్న ప్రకారం.. కరెంట్ తీగల మధ్య చిక్కుకున్న తన పిల్ల కోతిని కాపాడుకునేందుకు ఓ తల్లి కోతి చేసిన సాహసం నెటిజన్లను కదిలిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్ల కోసం ప్రాణాలకు తెగించి, అత్యంత చాకచక్యంగా దానిని రక్షించింది. ఈ తల్లి కోతి సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మనుషులకే కాదు, జంతువులకూ పేగు బంధం గొప్పదని ఈ ఘటన నిరూపించింది.






