- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం గారు ఈ వీడియో చూశారా.. ఎక్కువ మాట్లాడితే పళ్లు రాలిపోతయి.. మహిళా ప్రభుత్వ ఉద్యోగినిపై తిట్ల దండకం.. (వీడియో)
ఢిల్లీలో ఓ ప్రభుత్వాధికారి అహంకారపూరితమైన, అసహ్యకరమైన ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెషనల్ సెట్టింగ్స్‌లో మహిళలు ఎలాంటి మాటలు పడుతున్నారో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో ఓ ప్రభుత్వాధికారి అహంకారపూరితమైన, అసహ్యకరమైన ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెషనల్ సెట్టింగ్స్‌లో మహిళలు ఎలాంటి మాటలు పడుతున్నారో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ వివేక్ విహార్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, డీడీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఆఫీసర్.. ఓ విషయంలో భారతి అనే మహిళను దారుణంగా తిట్టాడు. మేడం చెప్తే చేశానన్నా వినకుండా ఎక్కువ మాట్లాడితే పళ్లు రాలిపోతాయని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకెంత కాలం బతుకుతావ్ అంటూ ఆమె ఉనికిని ప్రశ్నించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో కూడా స్త్రీలపట్ల ఇలాంటి ప్రవర్తన ఉండటం శోచనీయమని అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో సీఎం వరకు చేరేలా, అతను వెంటనే సస్పెండ్ అయ్యేలా చేయాలని కోరుతున్నారు. దీంతో సీఎం రేఖా గుప్తా, ఢిల్లీ పోలీస్‌ను ట్యాగ్ చేస్తూ నంబర్ ఆఫ్ పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.






