- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్‌లో స్క్రోలింగ్ సమస్య.. తీవ్ర ఇబ్బంది పడుతున్న యూజర్లు
“వినియోగదారులు WhatsApp Webలో చాట్స్ స్క్రోల్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశ వ్యాప్తంగా ఉదయం నుంచి వాట్సప్ యూజర్లు (వాట్సప్ యూజర్లు) తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాట్ స్క్రోలింగ్ (Scrolling problem)లో తీవ్ర జాప్యం జరగడంతో ఫోన్‌కు ఎమైందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది ముఖ్యంగా వెబ్ వర్షన్ (Web version)లో తలెత్తిన పెద్ద సమస్యగా గుర్తించారు. అలాగే అనేక మంది చాట్‌లను చదివే క్రమంలో కూడా టెక్స్ట్ సరిగ్గా లోడ్ కాకపోవడంతో సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా (Social media) వేదికగా తమ సమస్యలను వివరిస్తూ.. వాట్సాప్ యూజర్లు (WhatsApp users) పోస్టులు పెడుతున్నారు. అయితే దీనికి తాత్కలిక పరిష్కారంగా నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వాట్సాప్‌ను రిఫ్రెష్ చేయడం, రీ లాగిన్ చేయడం, కొత్త టాబ్‌లో వాట్సాప్ ను ఓపెన్ చేయడం ద్వారా మెరుగ్గా పని చేస్తుందని సూచిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా అనేక యూజర్లు ఈ సమస్యపై పోస్టులు పెడుతుండగా.. ఈ సమస్యలపై WhatsApp, Meta నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన, వివరణ రాకపోవడం గమనార్హం.
సర్వర్, స్క్రోలింగ్ సమస్యలను ఎదర్కొన్న ప్రాంతాలు






