- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Save Water: సేవ్ వాటర్.. హోలీ ఒక్క రోజే కాదు.. 364 రోజులు!
హోలీ పండుగ వచ్చిందంటే.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సంతోషంగా రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలతో జరుపుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: హోలీ (Holi) పండుగ వచ్చిందంటే.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సంతోషంగా రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. అయితే, గత కొన్నేళ్లుగా ఈ వేడుక అధిక మొత్తంలో నీటి దుర్వినియోగానికి కారణమవుతుంది. దీంతో చాలా మంది సోషల్ మీడియాలో హోలీ వేడుకల్లో నీటి వృథాపై అవగాహన కల్పిస్తున్నారు. అధికారులు సైతం నీటిని ఆదా చేయాలని, హోలీ వేడుకల్లో నీటి వినియోగం తగ్గించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఓ పోస్టు వైరల్‌గా మారింది. అదే ' Worry About Water Wastage For 364 Days, Not Only On Holi' అని ప్లకార్డులు పట్టుకుని ఓ వ్యక్తి రోడ్డుపై నిలుచున్న ఫోటో నెటిజన్లను ఆలోచింపజేస్తుంది.
సాధారణంగా ప్రతి మనిషి సామాజిక బాధ్యత కలిగి ఉండాలి. కానీ ప్రస్తుత రోజుల్లో అది కొరవడింది. కేవలం ఏదైనా విశేషమో, పండుగో ఉంటేనే మొక్కుబడిగా సమాజంపై తమకున్న బాధ్యతను చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో హోలీ వేడుకల వల్ల నీటి వృథా ఎక్కువవుతుంది. హోలీ వేడుకల్లో వాటర్ వినియోగాన్ని బ్యాన్ చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, కేవలం హోలీ లాంటి పండుగల సమయంలో మాత్రమే మనం ఎందుకు నీటి గురించి ఆలోచిస్తున్నాం? అంటే.. మిగతా రోజుల్లో వాటర్ వేస్టేజ్ అవ్వటం లేదని, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనేనా దీని అర్థం.
పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. భారతదేశంలో ప్రతి సందర్భాన్ని ఓ పండుగలా చేసుకోవటం ఆనాదీగా వస్తున్న ఆనవాయితీ. అంతేకాదు, భారతీయ పండుగలకు.. మానసిక, శారీరక ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే మన పెద్దలు సమాజంలో పండుగలకు ఒక గొప్ప స్థానం ఇచ్చారు. హోలీ పండుగను కూడా వసంత ఋతువు సూచికగా జరుపుకుంటాం. కొత్త ప్రారంభాలకు స్వాగతం పలుకుతూ రంగులు చల్లుకుంటాం. అంతేకానీ, ఒక వస్తువునో లేదా ఒక వనరునో నాశనం చేసేందుకు జరుపుకోము. అయితే, మారిన కాలనుగుణంగా పండుగలను జరుపుకునే విధానం కూడా మారుతూ వస్తుంది. కొన్నిసార్లు ఈ మార్పు అవశ్యకత కూడా తప్పదు.
ఇక పెరుగుతున్న కాలుష్యం, అడుగంటుతున్న భూగర్భ జలాలు, దంచికోడుతున్న ఎండలు వీటంన్నిటికి కూడా మనమే కారణం. ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న వనరులను భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత మన అందరిపై ఉంది. అలా అని ఏడాదిలో ఒక్క రోజు జరుపుకునే పండుగపై ఆంక్షలు విధించుకోవటం కాదు.. మిగతా 364 రోజులు కూడా అంతే బాధ్యతగా నడుచుకోవాలి. హోలీ రోజు నీటిని ఆదా చేయాలనే ఆలోచన కేవలం హోలీ రోజుకు మాత్రమే పరిమితమైతే సరిపోదు సంవత్సరం పొడవునా నీటిని ఆదా చేసుకుంటేనే ముందు తరాల వారికి భవిష్యత్తు ఉంటుంది. ఈ సందర్భంగా మన సమిష్టి బాధ్యతను లోతుగా తెలుసుకుందాం. సంవత్సరంలో ప్రతిరోజూ ఈ విలువైన వనరును వృధా చేయడాన్ని ఎలా ఆపవచ్చో అన్వేషిద్దాం!
Read More..






