- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ అభ్యర్థి వినూత్న ఆలోచన.. వెయ్యి రూపాయి బిళ్లలతో నామినేషన్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సందడి మొదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సందడి మొదలైంది. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డు సభ్యుల పదవులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమై నేటతో ముగియనుంది. తొలి రోజు నుంచే అభ్యర్థుల నుంచి మందకొడిగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. మొత్తం మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జంగిలి మహేందర్ అనే సర్పంచ్ అభ్యర్థి తన నామినేషన్ వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఏకంగా వెయ్యి రూపాయల బిల్లలను సేకరించి ఎన్నికల అధికారికి డిపాజిట్ రూపంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే, గత ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేసిన మహేందర్.. కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయారు. ఈ క్రమంలోనే ప్రజలకు ఒక్క ఓటు విలువ తెలియాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా వెయ్యి రూపాయల బిల్లలతో ఇవాళ నామినేషన్ వేసినట్లుగా మహేందర్ వెల్లడించారు.






