- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. కారు అద్దం నుండి బయటకు వచ్చిన పాము.. వీడియో వైరల్
బెంగుళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నామక్కల్ సాలెం రోడ్డులో ఓ వ్యక్తి కారులో వెళుతున్న సమయంలో సైడ్ మిర్రర్లో నుండి పాము బయటకు వచ్చింది. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నామక్కల్ సాలెం రోడ్డులో ఓ వ్యక్తి కారులో వెళుతున్న సమయంలో సైడ్ మిర్రర్లో నుండి పాము బయటకు వచ్చింది. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. కారు అద్దం లోపలి నుండి పాము రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మెల్లిగా కారును పక్కన ఆపి దిగిపోయాడు. కొద్దిసేపటి తరవాత పాము కిందకి దిగడంతో అక్కడ నుండి వెళ్లిపోయాడు.
చలి మరియు వర్షాలు కురుస్తుండటంతో పాములు, ఇతర జీవులు పార్క్ చేసిన వాహనాల్లో వెచ్చదనం కోసం దాక్కుంటాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా వాహనాల్లో పాములు కనిపిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాబట్టి వాహనం ప్రారంభించే ముందు జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా చెట్ల కింద, గడ్డిలో కాకుండా పొడిగా ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలని సూచిస్తున్నారు. VIDEO






