సందీప్ రెడ్డి వంగా-దీపిక గొడవ.. పీఆర్ స్టంట్స్‌‌పై యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్.. ఫుల్ సపోర్ట్ నీకే అంటూ..

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-15 12:53:07  IST  )

సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీ రిలీజ్ కాకుండానే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇందుకు సంబంధించిన సమాచారమే కనిపిస్తుంది. ఓవర్ డిమాండ్స్‌తో దీపికను మూవీ నుంచి తీసేసి..

సందీప్ రెడ్డి వంగా-దీపిక గొడవ.. పీఆర్ స్టంట్స్‌‌పై యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్.. ఫుల్ సపోర్ట్ నీకే అంటూ..
X

దిశ, ఫీచర్స్ : సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీ రిలీజ్ కాకుండానే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇందుకు సంబంధించిన సమాచారమే కనిపిస్తుంది. ఓవర్ డిమాండ్స్‌తో దీపికను మూవీ నుంచి తీసేసి.. త్రిప్తి దిమ్రిని ఎంచుకోవడంతో బాలీవుడ్ పీఆర్ స్టంట్స్ స్టార్ట్ అయ్యాయి. కథను లీక్ చేయడంతోపాటు త్రిప్తిని విమర్శించినందుకు.. డైరెక్టర్ గట్టిగానే వేసుకున్నాడు. పబ్లిక్‌గా పరువు తీశాడు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ పీఆర్ స్టంట్స్ గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

‘ఏ దిల్ హై ముష్కిల్’ మూవీ ప్రమోషన్ టైంలో ఈ కామెంట్స్ చేశాడు రణ్‌బీర్. ‘ పీఆర్ అంటే యాక్టర్‌కు, ఆడియన్స్‌కు మధ్య వారధిలా ఉండాలి కానీ బాలీవుడ్ పీఆర్ మాత్రం అలా చేయరు. యాక్చువల్లీ ఇండస్ట్రీని నడిపిస్తుంది వాళ్లే అనిపిస్తుంది. వారి మధ్య గొడవలు వస్తే అపోజిట్ పీఆర్‌కు సంబంధించిన హీరోహీరోయిన్లను టార్గెట్ చేస్తరు. డర్టీ పాలిటిక్స్ చేస్తరు. అందుకే తను పీఆర్‌ను పెట్టుకోలేదు’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ విషయంలో అనుష్క శర్మ కూడా రణ్‌బీర్‌కు మద్దతిచ్చింది. కాగా ఈ వీడియో చూసిన వంగా ఫ్యాన్స్ కూడా మా ఫుల్ సపోర్ట్ నీకే అంటున్నారు.

Next Story