సైనా నెహ్వాల్ విడాకులు.. ట్రెండ్ అవుతున్న స్టాండ్ అప్ కమెడియన్.. నిజమేనంటారా???

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-14 17:01:31  IST  )

సైనా నెహ్వాల్ విడాకుల టాపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పారుపల్లి కశ్యప్‌తో పదమూడేళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న ఆమె.. కనీసం ఏడేళ్లు కూడా ఈ వివాహ బంధంలో ఉండలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. దాదాపు పద్నాలుగు కోట్ల ప్రాపర్టీ కలిగిన ఆమె

సైనా నెహ్వాల్ విడాకులు.. ట్రెండ్ అవుతున్న స్టాండ్ అప్ కమెడియన్.. నిజమేనంటారా???
X

దిశ, వెబ్ డెస్క్: సైనా నెహ్వాల్ విడాకుల టాపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పారుపల్లి కశ్యప్‌తో పదమూడేళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న ఆమె.. కనీసం ఏడేళ్లు కూడా ఈ వివాహ బంధంలో ఉండలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. దాదాపు పద్నాలుగు కోట్ల ప్రాపర్టీ కలిగిన ఆమె.. ఎంత భరణం అడుగుతుందోననే చర్చ జరుగుతోంది. ఒకవేళ పారుపల్లి కశ్యప్‌ ఎదురుగా అలిమొనీ కోరితే ఎలా ఉంటుందనే డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలో స్టాండ్ అప్ కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనాకు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. పోస్టులు, రీపోస్టులతో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

విషయం ఏంటంటే.. ఈ క్లిపింగ్‌లో సమయ్ రైనా.. ‘ఈ రోజుల్లో కొంతమంది వ్యక్తులు బయోపిక్‌లుగా మారుతున్నారు. ఇది చెడు విషయం కాదు. గొప్ప విషయమే. కానీ ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు బయోపిక్ ఎలా చేయగలరు? వెయిట్ చేయండి. మిగతా జీవితంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలీదు కదా’ అని కామెంట్ చేశాడు. ఆ టైంలో మేరీకోమ్, సైనాతోపాటు మరికొంత మంది క్రికెటర్స్ బయోపిక్స్ కూడా రావడంతో ఈ ఇష్యూని స్టాండ్ అప్ కామెడీకి తీసుకున్నాడు సమయ్. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. మేరీకోమ్, సైనా తమ బయోపిక్స్ వచ్చాక ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దీనివల్లనే ప్రస్తుతం సమయ్ రైనా వైరల్ అవుతున్నాడు. దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ఈయన చెప్పేది నిజమే కదా అంటున్నారు.

VIDEO

Next Story