- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పని మనిషికి రూ. 50వేల జీతం.. ఏటా హైక్స్, డ్రైవింగ్ లైసెన్స్.. నెట్టింట పెద్ద చర్చ
రష్యన్ కంటెంట్ క్రియేటర్, వ్యాపారవేత్త ఇఉలియా అస్లామోవా రీల్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తన కుమార్తె ఎలెనాకు నానిగా పని చేస్తున్న పని మనిషికి నెలకు రూ. 50వేల జీతం ఇస్తున్నట్లు వెల్లడించడంతో ఆన్‌లైన్‌లో డిస్కషన్ స్టార్ట్ అయింది. ‘డొమెస్టిక్ హెల్పర్

దిశ, వెబ్ డెస్క్ : రష్యన్ కంటెంట్ క్రియేటర్, వ్యాపారవేత్త ఇఉలియా అస్లామోవా రీల్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తన కుమార్తె ఎలెనాకు నానిగా పని చేస్తున్న పని మనిషికి నెలకు రూ. 50వేల జీతం ఇస్తున్నట్లు వెల్లడించడంతో ఆన్‌లైన్‌లో డిస్కషన్ స్టార్ట్ అయింది. ‘డొమెస్టిక్ హెల్పర్ జాబ్స్‌ను కూడా కార్పోరేట్ ఉద్యోగాల మాదిరిగా ప్రొఫెషనలిజంతో, గౌరవ మర్యాదలతో చూడాలి. పర్ఫార్మెన్స్ ఆధారంగా ఏటా హైక్స్, నాని డెవలప్ మెంట్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తాను. ఈ విధంగా చేయడం వల్ల వారిలో విశ్వాసం పెరుగుతుంది. ఉన్నత నాణ్యతతో పని చేస్తారు. దీర్ఘకాలిక సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇంత వరకు తన దగ్గర ఎవరూ రిజైన్ చేయలేదు’ అని చెప్పింది. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డొమెస్టిక్ స్టాఫ్‌పై చూపించే గౌరవాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇలా అధిక జీతం ఇవ్వడం వల్ల మిగతా పని మనుషులు కూడా ఇలాగే డిమాండ్ చేస్తారని.. డొమెస్టిక్ హెల్పర్స్ జీతాల మార్కెట్ పెంచేస్తారని విమర్శించారు.






