- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుతిన్ నివాసంపై డ్రోన్లతో దాడి.. సంచలన వీడియో విడుదల చేసిన రష్యా
నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని వాల్డై సమీపంలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక నివాసంపై ఈ నెల 28న అర్ధరాత్రి 91 లాంగ్-రేంజ్ డ్రోన్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: నోవ్‌గోరోడ్ (Novgorod) ప్రాంతంలోని వాల్డై సమీపంలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అధికారిక నివాసం (Dolgiye Borody)పై ఈ నెల 28న అర్ధరాత్రి 91 లాంగ్-రేంజ్ డ్రోన్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ డ్రోన్లను రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చివేశాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా డ్రోన్ దాడికి సంబంధించిన సంచలన వీడియోను విడుదల ఆర్మీ అధికారులు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.
ఆరోపణలను ఖండించిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్
ప్రెసిడెంట్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ (Ukraine) భారీ డ్రోన్ దాడి చేసిందని మాస్కో సంచలన ఆరోపణలు చేసింది. ఈ దాడిని ‘స్టేట్ టెర్రరిజం’ అని అభివర్ణించింది. ఇది శాంతి చర్చలను దెబ్బతీసే ప్రయత్నమని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య ఫ్లోరిడాలో జరిగిన సానుకూల చర్చల తర్వాత ఈ ఆరోపణలు రావడం ఇరు దేశాల మధ్య కొత్త టెన్షన్‌ను సృష్టిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇదొక కొత్త కట్టుకథ అంటూ ఫైర్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సానుకూల చర్చలను దెబ్బతీయడానికి, ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులకు సాకు చూపించడానికి రష్యా ఈ నాటకం ఆడుతోందని జెలెన్స్కీ ఆరోపించారు.






