- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీధుల్లో పరుగులు.. చివరికి ఆకాశంలో ప్రత్యేక్షం! వైరల్‌గా మారిన ఎడ్ జీబ్రా!
వీధుల్లో పరుగులు పెడుతూ హల్ చల్ సృష్టించిన జీబ్రా (Zebra) ఎట్టకేలకు అధికారులకు చిక్కింది.

దిశ, వెబ్ డెస్క్: వీధుల్లో పరుగులు పెడుతూ హల్ చల్ సృష్టించిన జీబ్రా (Zebra) ఎట్టకేలకు అధికారులకు చిక్కింది. గత వారం రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన జీబ్రా కథ సుఖాంతం అవ్వటంతో అంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే? అమెరికాలోని (America) టేనస్సీ ( Tennessee) రాష్ట్రంలోని క్రిస్టియానా ప్రాంతానికి చెందిన లారా ఫోర్డు అనే వ్యక్తి ఎడ్ అనే జీబ్రాను పెంచుకుంటున్నాడు. అయితే, ఓ రోజు ఈ జీబ్రా ఆకస్మాత్తుగా వారి ఫార్మ్‌హౌస్ నుంచి పారిపోయి, రహదారులపై అలజడి సృష్టించింది.
రోడ్లపై జీబ్రా పరుగులు పెట్టడం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై జీబ్రా యజమాని అధికారులకు ఫిర్యాదు చేయటంతో సీసీ కెమెరాల ఆధారంగా దానిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. వారం రోజులుగా దాని కోసం గాలిస్తుండగా.. చివరికి ఆదివారం రోజున అధికారులకు చిక్కింది. అయితే ఇక్కడ జీబ్రాను పట్టుకునే విధానం అసలైన ట్విస్ట్.. ఓ భారీ నెట్‌లో దాన్ని వేసి, హెలికాప్టర్‌తో గాల్లోకి ఎత్తి యజమాని వద్దకు తరలించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు.. 'తల బయట పెట్టి జీబ్రా బాధగా కనిపిస్తుంది' అంటూ కొందరు, 'మొత్తానికి క్షేమంగా దొరికింది' అంటూ మరికొందరు భావోద్వేగంతో కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఘటనపై ఎడ్ యజమాని లారా ఫోర్డ్ స్పందిస్తూ.. 'ఇది చాలా ఒత్తిడిగా సాగిన వారమే. కానీ ఎవరూ గాయపడకుండా సుఖాంతం కావడం నిజంగా సంతోషంగా ఉంది' అని చెప్పారు. ప్రస్తుతం ఎడ్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని ధృవీకరించారు.






