కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.. వికారాబాద్ జిల్లా పోలీసుల వింత ఉత్తర్వులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-23 05:37:19  IST  )

ఆర్టీసీ సమ్మెకు సహరిస్తే.. చర్యలు తీసుకుంటామని తాండూరు పోలీసులు జారీ చేసిన వింత ఉత్తర్వులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.. వికారాబాద్ జిల్లా పోలీసుల వింత ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికుల సమ్మే ఉధృతంగా కొనసాగుతోంది. సమ్మె చేస్తున్న కార్మికులకు ప్రత్యక్షంగానే కాకుండా, పరోక్షంగా సాయం చేసినా చర్యలు తప్పవంటూ వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని తాండూరు (Tandur) పోలీసులు జారీ చేసిన వింత ఉత్తర్వులు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ ఉత్తర్వుల్లో తాండూరు పట్టణ పరిధిలోని టెంట్ హౌస్ షాపు ఓనర్లు, ఫంక్షన్ హాల్ యజమానులు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్స్ అసోసియేషన్ సభ్యులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా వేళ ఎవరైనా పోలీసుల ఆదేశాలను కాదని సమ్మె శిబిరాలకు టెంట్లు, ఇతర సామాన్లు అద్దెకు ఇచ్చి మద్దతు పలికితే, వారిపై కఠినమైన చట్టరీత్య చర్యలు తీసుకుంటామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) పేరుతో ఆర్డర్ విడుదల చేశారు.

వింత ఉత్తర్వులపై విమర్శలు..

సాధారణంగా సమ్మెలు జరిగినప్పుడు శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు, ఇలా వ్యాపారస్తులను టెంట్లు ఇవ్వకూడదని ఆదేశించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కార్మికుల ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వ్యాపారం చేసుకునే వారికి, సమ్మెకు సంబంధం ఏంటి.. టెంట్లు ఇస్తే కేసులు పెడతామనడం ఏందని అంటూ నెటిజన్లు ఈ నోటీసులను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

Next Story