రూ.7,500 ట్యాక్స్ కడితే రూ.1 లక్ష రీఫండ్.. నెట్టింట్లో వైరల్ లేఖపై క్లారిటీ ఇచ్చిన RBI

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-17 11:09:21  IST  )

రూ.7,500 ట్యాక్స్ చెల్లిస్తే రూ.1 లక్ష ఇస్తామంటూ ఆర్‌బీఐ (RBI) పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది.

రూ.7,500 ట్యాక్స్ కడితే రూ.1 లక్ష రీఫండ్.. నెట్టింట్లో వైరల్ లేఖపై క్లారిటీ ఇచ్చిన RBI
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆన్‌లైన్ ప్రపంచంలో సరికొత్త మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేరిట ఓ లేఖ విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, సదరు లేఖలో రూ.7,500 రీఫండబుల్ ట్యాక్స్ చెల్లిస్తే, రిజర్వ్ బ్యాంక్ ఖాతాదారులకు ఏకంగా రూ.లక్షల విడుదల చేస్తుందని నమ్మబలికారు. ఈ ఆఫర్ నిజమేనని నమ్మి ప్రజలు మోసపోయే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం దీనిపై స్పందించింది.

కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వైరల్ లేఖను పరిశీలించింది. అనంతరం అది పూర్తి ఫేక్ లెటర్ అని తేల్చి చెప్పింది. ఆ లేఖతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎటువంటి సంబంధం లేదని.. అది పక్కా సైబర్ కేటుగాళ్లు సృష్టించిన ఫేక్ లెటర్ అని స్పష్టం చేసింది. అదేవిధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సామాన్య ప్రజల నుండి ఎలాంటి పన్నులు వసూలు చేయదని పీఐబీ పేర్కొంది. నగదు బదిలీ ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించబోదని, ప్రజలు ఇలాంటి ఫేక్ లెటర్లు, ఈమెయిళ్లు, లింకులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించింది.

Next Story