- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దోచుకునేందుకు దోపిడీ దొంగల యత్నం.. కదిలే ఆటోలో మహిళ సాహసం (వీడియో)
ఒంటరిగా మహిళలు కనబడితే చాలు దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఒంటరిగా మహిళలు కనబడితే చాలు దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు చైన్ స్నాచింగ్ (Chain Snatching)లకే పరిమితమైన కేటుగాళ్లు సరికొత్త మార్గాల్లో దొంగతనాలకు పాల్పడతున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ (Punjab) రాష్ట్రంలో ఓ మహిళ చేసిన సాహసం అందరి చేత ఔరా.. అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. జలంధర్-లుథియానా (Jalandhar-Ludhiana) జాతీయ రహదారిపై ఓ మహిళా ఒంటిరిగా ఆటోలో వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం ఆటోను ఆపారు. అనంతరం ఆ మహిళ ఒంటిపై ఉన్న బంగారం హ్యాండ్ బ్యాగ్‌ను కొట్టేయాలని చూశారు. కానీ, సదరు మహిళ కదులుతున్న ఆటోలో దుండగులతో వీర వనితలా పోరాడి తన పోరాట పటిమను చాటింది. ఆటో అంచున వేలాడుతూ.. సాయం కోసం గట్టిగా కేకలు పెట్టింది. అయితే, వెనుకలే కారులో ప్రయాణిస్తున్న కొందరు ఆటోను వెంబడిస్తూ ఈ తతంగాన్ని అంతా వీడియో తీశారు. అనంతరం వేగంగా వెళ్లి ఆ ఆటో కారును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు దుండగులను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయితే, ఆటోకు వేళాడుతూ.. ఆ మహిళ చేసిన స్టంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.






