- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుప్రమాదం వీడియో వైరల్.. గాయంతో విలవిలలాడుతుంటే మహిళ షాకింగ్ ప్రవర్తన
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు నెటిజన్లను అసంతృప్తి, అసహనం, ఆగ్రహానికి గురిచేస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో (Social media) నిత్యం అనేక వీడియోలు వైరల్ (Viral) అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు నెటిజన్లను అసంతృప్తి, అసహనం, ఆగ్రహానికి గురిచేస్తుంటాయి. తాజాగా బెంగుళూరులో (Bangalore) జరిగిన ఓ రోడ్డుప్రమాదం వీడియో చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? నెటిజన్లకు కోపం వచ్చేలా వీడియోలో ఏముంది? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
బెంగళూరులో ఇటీవల ఓ రోడ్డుప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. కారు, బైకు ఎదురెదురుగా ఢీకొనటంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీరని చర్చకు దారి తీసింది. ఈ వీడియోలో బైక్ రోడ్డు మధ్య బోల్తా పడినట్లు, బైకర్ చేతికి, ముఖానికి గాయాలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అతడి పరిస్థితి చూసి జాలిపడాల్సిందిపోయి.. కారు డ్రైవ్ చేసిన మహిళ మాత్రం వీరంగం సృష్టించింది. అతడిపై గట్టిగా అసభ్య పదజాలంతో విరుచుకుపడింది. తీవ్ర రక్తంస్రావం అవుతున్న అతడిని చూస్తూ కూడా నటిస్తున్నావంటూ, అతడిని తీవ్రమైన మాటలతో అవమాంచింది. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది.
ఇక ఈ ప్రమాదంలో రోడ్డు బైక్ పక్కన బోర్లా పడినట్లు స్పష్టంగా కనిపించగా, కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి కారణం ఎవరో స్పష్టంగా తెలియలేదు. అయితే, మహిళ ప్రవర్తనపై మాత్రం నెటిజన్లు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఇంత రక్తం వస్తుంటే కూడా ఇలా అరిచే హక్కు ఎవరికీ లేదు. ఆ వ్యక్తి నెత్తుటితో ఉన్నాడు. కారులో ఉన్నవారికి ఎక్కువ బాధ్యత ఉండాలి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.






