- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అబ్బాయిలను నమ్మొద్దు’.. ఆర్‌జే మహ్‌వశ్ సంచలన వీడియో
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లి పీటలమీద ఆగిపోయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లి పీటలమీద ఆగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పలాష్ ముచ్చల్‌కు వేరే వాళ్లతో సంబంధాలు ఉన్నాయని కూడా ప్రచారం మొదలైపోయింది. మేరీ డి'కోస్టాతో చాటింగ్ కూడా వైరల్ అయ్యింది. దీంతో స్మృతి, పలాష్ మధ్య బ్రేకప్ అయిందని కూడా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ స్నేహితురాలు ఆర్‌జే మహ్‌వశ్(RJ Mahvash) స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. స్మృతి మంధాన పెళ్లి వాయిదా నేపథ్యంలో మహ్‌వశ్ ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు భావిస్తున్నారు.
కానీ ఆమె నేరుగా ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ‘అబ్బాయిలను కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే వారిని అడిగితే నేను సింగిల్ అనే చెబుతారు. ఎక్కడా రిలేషన్‌లో ఉన్నామని చెప్పుకోరు.. అబ్బాయిలను అస్సలు నమ్మడానికి వీళ్లేదు.. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.. నా పెళ్లి సమయంలో నా వరుడిని ఒక వారం ముందుగానే సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తాను.. అతను ఎలాంటి వాడో ఎవరికి తెలిసినా నాకు నేరుగా చెప్పొచ్చు లేదా.. సోషల్ మీడియాలో అయినా అతనికి సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ పెట్టవచ్చు అని అన్నారు. మంచోడు కాదని తెలిస్తే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తానని చెప్పారు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది.






