- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
30 ఏళ్ల పాత కేసుకు ప్రతీకారం.. సీబీఐ ఆఫీసుపై విల్లు, బాణాలతో దాడి
మూడు దశాబ్దాల క్రితం తనను అవినీతి కేసులో ఇరికించారని పగ పెంచుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: మూడు దశాబ్దాల క్రితం తనను అవినీతి కేసులో ఇరికించారని పగ పెంచుకున్నాడు. ఏళ్లు గడిచినా ప్రతికార కాంక్షతో రగిపోయాడు. అదును చూసి అధికారులపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో మే 23న వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్లితే.. బిహార్ రాష్ట్రానికి చెందిన దినేశ్ ముర్ము (68) అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగం చేసేవాడు. 30 ఏళ్ల క్రితం తనపై అక్రమంగా కేసు పెట్టి అవినీతి ఇరికించారని సీబీఐ అధికారులపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆ అధికారులు లక్నోలోని సీబీఐ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారని తెలుసుకుని, విల్లు, బాణంతో అక్కడి వెళ్లి వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ASI) గాయపడినట్లు సమాచారం.
వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టిన కారణంగా రైల్వే ఉద్యోగం కోల్పోయానని, అప్పటి నుంచే తన జీవితం నాశనమైందని పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. తనను మానసికంగా హింసించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం పోలీసులు దినేశ్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రెండు వారాల రిమాండ్ విధించారు. గాయపడిన ASI ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన లక్నో పోలీసు శాఖను, సీబీఐని షాక్‌కు గురిచేసింది.






