- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికెన్ లెగ్ పీస్ కోసం రణరంగంగా మారిన పెళ్లి వేడుక.. కుర్చీలతో కొట్టుకున్న బంధువులు!
బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ లేదని ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి బృందం వీరంగం. కుర్చీలతో బాదుకున్న బంధువులు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి కోసం వచ్చిన బంధువులు చికెన్ లెగ్ పీస్ కోసం కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో బందువులు భోజనశాలలో చేర్లతో కొట్టుకోవడం స్పష్టంగా కనిపించింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా హసన్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఓ పక్క కొత్త జంట పెళ్లి చేసుకుంటుండగా.. బంధువులు మాత్రం చికెన్ లెగ్ పీస్‌ల కోసం గొడవకు దిగడంతో భోజనశాల రణరంగంగా మారింది. కేవలం బిర్యానీలో తగినన్ని లెగ్ పీస్‌లు లేవనే చిన్న కారణంతో మొదలైన వివాదం, ఇరువర్గాల మధ్య పెను ఘర్షణకు దారితీసింది. వరుడి తరఫు బంధువులు వడ్డనలో తమకు లెగ్ పీస్‌లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తుంది.
మొదట మాటలతో మొదలైన ఈ వాగ్వాదం క్షణాల్లోనే ముదిరిపోయి.. ఆగ్రహంతో ఊగిపోయిన ఇరువర్గాల వారు పెళ్లి మండపంలోని కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. భోజనశాలలో వస్తువులను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ హఠాత్పరిణామం తో పెళ్లికి వచ్చిన మిగతా అతిథులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘర్షణలో కొందరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా గొడవకు దిగిన వారిని గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హసన్‌పూర్ పోలీసులు వెల్లడించారు. ఒక లెగ్ పీస్ కోసం పెళ్లి పందిరిని యుద్ధ క్షేత్రంగా మార్చిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.






