Viral video: పిచ్చి పీక్స్.. కరకరలాడే కండోమ్ పకోడీలు! యువతి వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-06-05 11:35:56  IST  )

సోషల్ మీడియాలో ఓవర్ నైట్ పాపులర్ అవ్వడం కొంత మంది విచిత్రమైన కంటెంట్‌‌తో వీడియోలు క్రియేట్ చేస్తున్నారు.

Viral video: పిచ్చి పీక్స్.. కరకరలాడే కండోమ్ పకోడీలు! యువతి వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (viral video) సోషల్ మీడియాలో ఓవర్ నైట్ పాపులర్ అవ్వడం కొంత మంది విచిత్రమైన కంటెంట్‌‌తో వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది (Influencers) ఇన్‌ఫ్లూయెన్సర్ల పిచ్చి పీక్స్‌కు వెళుతోంది. సాధారణంగా వంటలు చేసే వీడియోలు చూసే ఉంటారు.. కానీ ఓ ఇన్‌ఫ్లూయేన్సర్ అందుకు భిన్నంగా ఓ వంటకం చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో చూపించిన ప్రకారం.. (young woman) ఓ యువతి (condom) కండోమ్‌లతో పకోడీలు చేసింది. ఉల్లిగడ్డ పకోడీల మాదిరిగా ఆ యువతి కండోమ్ పకోడీలు చేసి టమాట సాస్‌లో ముంచుకోని తిన్నది. కొత్త కండోమ్‌లను తీసుకోని తయారు చేసిన శనగపిండి మిశ్రమంలో ముంచి బజ్జీల మాదిరి వేడీ వేడిగా కాగే నూనెలో వేయించింది. కొంత సమయం తరువాత వేగిన కండోమ్ పకోడీలు ఒక గిన్నెలోకి తీసుకోని టమాట కెచప్‌లో ముంచుకోని టేస్ట్ చేసింది.

కరకరలాడే కండోమ్ పకోడీలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయోచ్చని యువతి తన ఫాలోవర్లకు సూచించింది. కండోమ్ పకోడీల వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు యువతిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కండోమ్ పకోడీలతో ఏమి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నావని, పకోడీలో మీరపకాయ ఒక్కటే తక్కువైందని నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. నీకు ఉన్న ఫ్రీడమ్‌తో సమాజంలో విషం వ్యాప్తి చేయకుండా మంచిని వ్యాప్తి చేయాలని ఆ యువతికి సూచించారు. ఇలాంటి వారిపై ఎందుకు చర్య తీసుకోరు? అని మరో నెటిజన్ ప్రశ్నించారు. ఇలాంటి పనికిమాలిన వీడియోలు క్రియేట్ చేసే వారిపై కూడా చర్యలు తీసుకోవాని నెటిజన్లు ప్రభుత్వాలకు సూచించారు.

Next Story