- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: రైలు పట్టాలపై రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఒడిశాలోని పూరీలో జరిగిన ఘటన వైరల్
ఒడిశా రాష్ట్రంలోని పూరీ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళఘాట్‌కు చెందిన 15 ఏళ్ల బిశ్వజీత్ సాహు అనే యువకుడు రీల్స్ చేయాలనే ఉత్సాహంలో ప్రాణాలు కోల్పోయాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా (Odisha) రాష్ట్రంలోని పూరీ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళఘాట్‌కు చెందిన 15 ఏళ్ల బిశ్వజీత్ సాహు అనే యువకుడు రీల్స్ (Reels) చేయాలనే ఉత్సాహంలో ప్రాణాలు కోల్పోయాడు. తల్లితో కలిసి దక్షిణ కాళి ఆలయాన్ని దర్శించిన అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉన్న బిశ్వజీత్, జనక్‌దేవ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలుపట్టాల వద్ద రీల్స్ చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్స్ పిచ్చి మరోసారి నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో చాటిచెప్పిందని నెటిజన్‌లు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం (అక్టోబర్ 21) సాయంత్రం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించి పూరీ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా కోసం ఒక చిన్న వీడియోను చిత్రీకరించడానికి బిశ్వజిత్, అతని స్నేహితుడు చందన్‌పూర్ సమీపంలోని (Janakdeipur railway station) జనక్‌దేవ్‌పూర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జికి వెళ్లారు. వీడియో చిత్రీకరిస్తుండగా, అతను రైలు ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనలో వీడియో రికార్డ్ చేస్తున్న మరో బాలుడు కూడా గాయపడ్డాడు. మేము అసహజ మరణ కేసును నమోదు చేశాము, పోస్ట్ మార్టం పరీక్ష నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించాము’ అని తెలిపారు. వీడియో ఇదే..






