Viral Video : ఆరుద్ర పురుగులు.. ఆహా.. చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయ్.. చిన్ననాటి జ్ఞాపకాల్లో తేలియాడుతూ..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-23 12:29:57  IST  )

ఆరుద్ర పురుగులు కనిపించాయంటే వర్షాకాలం మొదలైందని చెప్పేది నానమ్మ. వ్యవసాయం మొదలుపెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైనది. కాగా ఈ కార్తెలో మాత్రమే కనబడుతుంది ఆరుద్ర పురుగు. వెల్వెట్ క్లాత్ చుట్టుకున్నట్లుగా.. ఎర్రగా నిగనిగలాడుతూ చూడముచ్చటగా ఉండే పురుగు ఏ

Viral Video : ఆరుద్ర పురుగులు.. ఆహా.. చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయ్.. చిన్ననాటి జ్ఞాపకాల్లో తేలియాడుతూ..
X

దిశ, ఫీచర్స్ : ఆరుద్ర పురుగులు కనిపించాయంటే వర్షాకాలం మొదలైందని చెప్పేది నానమ్మ. వ్యవసాయం మొదలుపెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైనది. కాగా ఈ కార్తెలో మాత్రమే కనబడుతుంది ఆరుద్ర పురుగు. వెల్వెట్ క్లాత్ చుట్టుకున్నట్లుగా.. ఎర్రగా నిగనిగలాడుతూ చూడముచ్చటగా ఉండే పురుగు ఏ హాని చేయదు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే కనిపించి.. రైతులను ఆశీర్వదించి వెళ్లే దేవతలా అనిపిస్తుంది. ముఖ్యంగా వీటిని పట్టుకుని ఆడుకునే పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. త్వరలోనే ఇవి ఈ ఏడాది కూడా కనిపించే సమయం రాబోతుండగా.. ఆరుద్ర పురుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 90s కిడ్స్‌ను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తున్నాయి.

ఇక ఈ వీడియోలు షేర్ చేసిందుకు థాంక్స్ చెప్తున్న నెటిజన్లు.. దీంతో ముడిపడి ఉన్న మెమొరీస్ పంచుకుంటున్నారు. అమ్మమ్మ ఇల్లు, తొలకరి చినుకు, అగ్గిపెట్టెలో ఆరుద్ర పురుగులను దాచి పెట్టుకోవడం, పొలాల్లో కనిపిస్తే పంటలు బాగా పండుతాయని మురిసిపోవడం.. ఇలా ఒక్కొక్కటి పంచుకుంటున్నారు. ఇవి కనుమరుగైపోయాయని బాధపడ్డానని.. చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. ఇక కొందరు అయితే ఆరుద్ర పురుగు పేరుతో సోషల్ మీడియా పేజీలనే ఓపెన్ చేశారంటే.. ఈ పురుగుతో మనిషికి ఉన్న అనుబంధం ఏంటో అర్థమవుతుంది.

Next Story