Indian Railways : ఏసీ కోచ్ లో ఎలుకలు.. మండిపడిన ప్రయాణికుడు

by Muthe.Rajitha |   (  Updated:2025-03-13 12:20:44  IST  )

భారతీయ రైళ్ళ(Indian Railways)లో వసతులు సరిగా లేవని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు, కొన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేయడం చూస్తూ ఉంటాము.

Indian Railways : ఏసీ కోచ్ లో ఎలుకలు.. మండిపడిన ప్రయాణికుడు
X

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ రైళ్ళ(Indian Railways)లో వసతులు సరిగా లేవని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు, కొన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేయడం చూస్తూ ఉంటాము. కాని సౌత్ బీహార్ ఎక్స్ ప్రెస్ రైలు(South Bihar Express Train)లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను నిద్రపోతున్న బెర్త్ వద్ద ఎలుకలు తిరగడం(Rats Crawling), కప్పుకునే బెడ్ షీట్స్ ఎలుకలు కొరికి ఉండటంతో ఖంగు తిన్నాడు. దీనిపై ఆ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సౌకర్యంగా వెళ్ళవచ్చని రూ.2 వేలు పెట్టి ఏసీ కోచ్ లో టికెట్ కొంటే.. ఇదేనా మీరిచ్చే సౌకర్యం అంటూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) కు ట్వీట్ చేశాడు.

ఎలుకలు తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు స్పందిస్తూ.. ఇదంతా మనకు సాధారణమే కదా.. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం, జపాన్ లో కాదని వ్యంగాస్త్రాలు విసిరారు. మరికొందరు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫిర్యాదు అందుకున్న తర్వాత ఆ కోచ్ లో దోమలమందు పిచికారి చేశారని, ఎలుకల గ్లూ పెట్టారని అధికారులు వెల్లడించారు.

Next Story