ఎలుక ఐస్.. యమ కూల్.. కూల్ ! మీరూ టేస్ట్ చేస్తారా..?

by D.Reddy |
ఎలుక ఐస్.. యమ కూల్.. కూల్ ! మీరూ టేస్ట్ చేస్తారా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ఆహార పదార్థాల్లో కప్పలు, పాములు, మనిషి వేలు వంటివి ప్రత్యేక్షమవటం తరచూ వార్తల్లో చూస్తున్నాం. తాజాగా ఇలాంటి మరో ఘటన వెలుగుచూసింది. హోటళ్లకు, స్ట్రీట్ ఫుడ్ పాయింట్లకు సరఫరా చేసే ఐస్ బ్లాక్‌లో చనిపోయిన ఎలుక (Rat) కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటో (Photo) నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు

ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు శీతల పానీయాలు (Cool drinks) తాగేందుకు ఇష్టపడుతున్నారు. మిల్క్ షేక్, చెరుకు రసం, నిమ్మకాయ సోడా, లస్సీ, జ్యూస్‌లు వంటి అనేక పానీయాల్లో ఐస్ కలుపుతుంటారు. ఇక చాలా మంది రోజులో ఒక్కసారైనా ఈ పానీయాలను సేవిస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో ఉపయోగించే ఐస్ బ్లాక్‌లో చనిపోయిన ఎలుక ప్రత్యేక్షం అయింది. అయితే, ఈ ఫొటో ఏ ప్రాంతానికి చెందినదో తెలియలేదు. అయితే, ఈ ఫొటో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఎక్ట్రా ఐస్ కాదు.. నో ఐస్ అని చెప్పాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే, వీధి వ్యాపారులకు, రెస్టారెంట్లకు ఐస్ బ్లాక్‌లు సప్లై చేసే ఫ్యాక్టరీలపై ఫుడ్ సెఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed