- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరుదైన దృశ్యం.. బల్లి తోక నుంచి మంటలు
కాంబోడియాలోని ఒక వ్యక్తి ఇంట్లో గోడపై అసాధారణంగా కనిపించే బల్లి తోకను కదిలించగానే అబ్బురపరిచే దృశ్యం వెలుగుచూసింది.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా మన ఇంట్లో గోడలపై పాకే బల్లులు గురించి అందరికి తెలిసే ఉంటుంది. చిన్న తోకను ఆడిస్తూ, అటు ఇటు తిరుగుతూ చిరాకు తెప్పిస్తుంటాయి. అయితే, తాజా కాంబోడియాలో ఓ వ్యక్తి ఇంట్లో కనిపించిన చిన్న బల్లి మాత్రం అసాధారణంగా, అరుదైన దృశ్యాన్ని సృష్టించింది. ఆ బల్లి తోకను కదిలించగానే, ఆ చిన్న తోక చివర నుండి ఎలక్ట్రిక్ స్పార్క్‌లాంటి మంటలు వెలుగు తీసి చుట్టుపక్కల అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @scaryencounter అనే పేజీ ద్వారా పంచుకున్నారు. వీడియోలో, బల్లి తోక చివర నుంచి స్పార్క్‌లాంటి మంటలు వెలిగిపోతున్నాయి, ఆ తర్వాత కొన్ని క్షణాల్లో ఆరిపోతాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ అరుదైన దృశ్యాన్ని వివిధ రకాలుగా అభిప్రాయపడుతున్నారు. కొందరు దీన్ని పోకీమాన్‌లోని చార్మాండర్ పాత్రతో పోల్చి, 'పోకీమాన్‌లోని చార్మాండర్‌ను కనుగొన్నావు' అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు, 'ఇది ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ వల్ల కావచ్చు, గోడలో ఎలక్ట్రికల్ ఫాల్ట్ కారణంగా బల్లి తోక కదిలించగానే స్పార్క్‌లు వెలిగిపోవచ్చు' అని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు, 'కెమెరా లెన్స్‌లో కాంతి పరావర్తనం వల్ల ఇది భ్రమగా కనిపించవచ్చు' అని సూచిస్తున్నారు.






