- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడు తీరంలో అరుదైన సముద్రపు జీవి.. రాబోయే ప్రమాదానికి సంకేతమా?
తమిళనాడు (Tamilnadu) తీరంలో అరుదైన సముద్రపు జీవి ప్రత్యేక్షమైంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamilnadu) తీరంలో అరుదైన సముద్రపు జీవి ప్రత్యేక్షమైంది. సాధారణంగా సముద్రపు చాలా లోతుల్లో జీవించే ఒర్‌ఫిష్ (Oarfish) మత్స్యకారుల వలలో చిక్కడం తీవ్ర కలకలం రేపింది. దీనిని డూమ్స్‌డే ఫిష్ (Doomsday fish) అని కూడా పిలుస్తారు. ఎందుకంటే జపాన్ వంటి దేశాలలో దీన్ని ప్రకృతి విపత్తులకు ముందస్తు సంకేతమని భావిస్తారు. దీంతో ఏదో పెద్ద ముప్పు రాబోతోందంటూ స్థానికులు భయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఏకంగా 30 అడుగుల పొడవు ఉన్న ఓ అరుదైన చేపను ఏడుగురు వ్యక్తులు పట్టుకుని నిలబడిన దృశ్యం కనిపిస్తోంది. దీని శరీరం వెండికాంతితో మెరుస్తూ, తల భాగంలో ఎరుపు రంగు రెక్కల వలె కనిపించే అలంకరణ ఉండటంతో, దాని ఆకృతి ఎంతో విశేషంగా ఉంది. అయితే, సాధారణంగా ఇది సముద్ర పై భాగానికి రాదు, అలా వచ్చిందంటే.. ఏదో విపత్తు రాబోతుందని చాలా మంది నమ్ముతారు.
శాస్త్రవేత్తల ప్రకారం, ఇది సాధారణంగా అనారోగ్యం కారణంగా లేదా సంభోగ కాలంలోనే పైకి వచ్చే అవకాశముంటుందంటున్నారు. దీనికి శరీరంలో మాంసకృత్తి తక్కువగా ఉండటంతో, ఇది నిదానంగా కదిలే జీవిగా గుర్తించబడింది. ఇటీవల ప్రపంచంలోని వివిధ తీరప్రాంతాల్లో తస్మానియా, మెక్సికో వంటి ప్రదేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ప్రపంచం అంతమైపోతుందేమోనని భయపడుతున్నారు. అయితే శాస్త్రీయంగా ఇప్పటివరకు దీనికి సరైన ఆధారాలు లేవు. ఈ అరుదైన చేప ప్రత్యక్షమవడం సముద్ర జీవన ప్రపంచంపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.






