కస్టమర్‌కు ముద్దుపెట్టిన రాపిడో డ్రైవర్

by Sujitha Rachapalli |

కస్టమర్‌కు ముద్దు పెట్టాడు రాపిడో డ్రైవర్. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. బ్యూటీ పార్లర్‌లో పని ముగించుకుని అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసింది ఓ మహిళ

కస్టమర్‌కు ముద్దుపెట్టిన రాపిడో డ్రైవర్
X

దిశ, వెబ్ డెస్క్ : కస్టమర్‌కు ముద్దు పెట్టాడు రాపిడో డ్రైవర్. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. బ్యూటీ పార్లర్‌లో పని ముగించుకుని అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసింది ఓ మహిళ. అయితే ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు డ్రైవర్. ముద్దు పెట్టి లైంగికంగా వేధించాడు. అయితే ఇంటికి చేరగానే ఆమె భర్తకు ఈ విషయాన్ని వివరించగా.. పట్టుకున్న అతను పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు అప్పగించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అర్ధరాత్రి వరకు బ్యూటీ పార్లర్‌లో ఎందుకు ఉంది? భర్త ఉన్నాడు కదా తీసుకెళ్లొచ్చు కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Next Story