కోటిన్నరతో తోబుట్టువు ఒడి నింపిన సోదరులు

by Sujitha Rachapalli |

రాజస్థానీ మాయ్రా సంప్రదాయం గురించి విన్నారా? తోబుట్టువు పిల్లల పెళ్లి సందర్భంగా.. సోదరులు సోదరికి పెద్ద మొత్తంలో బహుమతులు ఇచ్చే ఆనవాయితీ ఇది. తాజాగా బికనీర్ జిల్లా సీనియాలా గ్రామంలో

కోటిన్నరతో తోబుట్టువు ఒడి నింపిన సోదరులు
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థానీ మాయ్రా సంప్రదాయం గురించి విన్నారా? తోబుట్టువు పిల్లల పెళ్లి సందర్భంగా.. సోదరులు సోదరికి పెద్ద మొత్తంలో బహుమతులు ఇచ్చే ఆనవాయితీ ఇది. తాజాగా బికనీర్ జిల్లా సీనియాలా గ్రామంలో మాయ్రా పెద్ద మొత్తంలో అందుకుంది ఓ సోదరి. తన కొడుకుల పెళ్లి సందర్భంగా.. ఇద్దరు అన్నాదమ్ములు కలిసి ఏకంగా కోటిన్నరతో సోదరి ఒడి నింపారు.

భవరర్ లాల్ లేఘా, జగదీష్ లేఘా విజయవంతమైన వ్యాపారులు. కాగా ఇది వారికి మొదటి మాయ్రా. దీంతో ఈ సంప్రదాయంలో ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా ఏకంగా రూ. 1.56 కోట్ల బహుమతులు అందించారు. రాజస్థాన్ చరిత్రలో అత్యంత ఖరీదైన మాయ్రాగా వర్ణించబడుతున్న ఈ ఘటన.. అతిథులను ఆశ్చర్యపరిచింది. 31 తులాల బంగారం, 1.25 కిలోల వెండి వస్తువులతో కలిపి ఈ మాయ్రాను ఘనంగా అందించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగౌర్ MP హనుమాన్ బెనివాల్ హాజరయ్యారు.

Next Story