- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI Influencer: భారత తొలి ఏఐ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ రాధిక..! ఎక్కడికైనా వెళ్లగలదు..
ప్రస్తుతం AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) యుగం నడుస్తోంది. ప్రంపచంలోని అన్ని రంగాల్లో ఏఐ అడుగు పెడుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) యుగం నడుస్తోంది. ప్రంపచంలోని అన్ని రంగాల్లో ఏఐ అడుగు పెడుతోంది. ఇది వరకు ఏఐ న్యూస్ యాంకర్లను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఏఐ డాక్టర్లను సైతం జపాన్ వంటి అభివృద్ధి దేశాల్లో సృష్టించారు. ఏఐతో ఏదైనా సాధ్యమే.. అన్నట్లుగా నిపుణులు వింతైన ఏఐలు రూపొందిస్తున్నారు. తాజాగా ఏఐ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల (Social Media Influencer)ను సైతం క్రియేట్ చేశారు. అవును మీరు విన్నది నిజమే.. మనం రెగ్యూలర్‌గా సోషల్ మీడియాలో రకరకాల కంటెంట్‌లతో ఇన్‌ఫ్లూయెన్సర్లు వీడియోలు పోస్ట్ చేస్తారు. ఫుడ్, ట్రావెలింగ్ వంటి వివిధ రకాల విషయాల గురించి మన ఫేవరెట్ ఇన్‌ఫ్లూయెన్సర్ చెబుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోకి ఏఐ ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో మొట్ట మొదటి ఏఐ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లను రూపొందించారు. ఆ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు రాధిక సుబ్రమణియన్ (Radhika Subramaniam) అని పేరు సైతం నామకరణం చేశారు.
‘indiawithradhika’ అని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా రాధిక సుబ్రమణియన్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో వర్చువల్‌గా రాధిక పర్యటిస్తోంది. అక్కడ ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, వింతలు, విశేషాలు, ఫుడ్.. ఒక ట్రావెల్ వ్లాగర్ లాగా వీడియోలు, ఫోటోలు సేకరించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లకు అందిస్తోంది. ఎక్కడికైన రాధిక సోలోగా పర్యటించగలదు. కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్స్ అనే మీడియా కంపెనీ ఈ ఏఐని రూపొందించింది. ఏఐ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ తమిళంతోపాటు ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుతుంది. మరోవైపు ఈ ఏఐ జెన్‌జీ కిడ్. ఇక ఏఐ రాధిక గురించి కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు, గ్రూప్ CEO విజయ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రాధిక మనందరికీ తెలిసిన వ్యక్తిలా ఉంటుంది. ఆమె ఆలోచన, ఫ్రీడమ్ తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. ఒక స్నేహితురాలిగా కథలు చెప్పగలదని అతను చెప్పుకొచ్చారు.






