- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహిరంగ మూత్ర విసర్జనకు చెక్.. మైసూర్‌లో ప్రభుత్వం వినూత్న ప్రయోగం!
మైసూరులో బహిరంగ మూత్రవిసర్జనను అరికట్టేందుకు అధికారులు వినూత్న ప్రయోగం చేశారు

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని మైసూరు (Mysore)లో బహిరంగ మూత్రవిసర్జనను నివారించడానికి మైసూరు నగరపాలక సంస్థ అధికారులు ఆసక్తికర ప్రయోగం చేశారు. నగరంలోని ప్రధాన వీధులు, గోడల మూలల్లో ప్రజలు ఎక్కడపడితే అక్కడ యూరినేషన్ చేయకుండా ఉండేందుకు ఆ గోడలకు అద్దాలను (Mirrors) అమర్చారు. అయితే, అక్కడ పెద్ద అద్దాలను అమర్చడం వల్ల ప్రజల్లో కొంచమైనా మార్పు వస్తుందని భావిస్తున్నారు. మూత్ర విసర్జన చేయడానికి గోడ వద్దకు వెళ్లినప్పుడు వ్యక్తికి తన ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. ఇది వారిలో ఒక రకమైన సిగ్గు లేదా అసౌకర్యాన్ని కలిగించి, బహిరంగంగా మూత్రవిసర్జన చేయకుండా వెనక్కి తగ్గేలా చేస్తుంది. ఎవరైనా తనను చూస్తున్నారనే భావన ఆ వ్యక్తిలో బాధ్యతను పెంచుతుందని అధికారులు నమ్ముతున్నారు.
అయితే, కేవలం అద్దాలు అమర్చడమే కాకుండా, ఆ గోడలపై ‘నగర పారిశుద్ధ్యానికి సహకరించండి’ అనే సందేశాలను రాయించారు. సమీపంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ల వివరాలను తెలిపే బోర్డులను కూడా అమర్చారు. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, మైసూరు నగరపాలక సంస్థ (MCC) చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నంపై సోషల్ మీడియా (Social Media)లో పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది.






