రీల్స్ పిచ్చి..బండి మీదే బరితెగించిన లవర్స్..వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

యువతలో రీల్స్ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతుంది. లైక్స్, వ్యూవ్స్ కోసం వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు బ‌రితెగించి ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

రీల్స్ పిచ్చి..బండి మీదే బరితెగించిన లవర్స్..వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: యువతలో రీల్స్ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతుంది. లైక్స్, వ్యూవ్స్ కోసం వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు బ‌రితెగించి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. రోడ్ల‌పై బైకుల మీద వెళుతూ ముద్దులు పెట్టుకోవ‌డంతో పాటు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. గ‌తంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం జ‌ర‌గ్గా బైక్ నంబ‌ర్ల ఆధారంగా పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు. కానీ అలాంటి వారిలో మార్పు రావ‌డంలేదు. తాజాగా ఇద్ద‌రు ల‌వ‌ర్స్ రోడ్డుపైనే రెచ్చిపోయారు. ఈ ఘ‌ట‌న పూణేలో చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

యువ‌కుడు త‌న ప్రేయ‌సిని బైక్ ట్యాంక‌ర్ పై కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేశాడు. యువ‌తి సైతం బ‌య‌ప‌డ‌కుండా అత‌డికి హగ్ ఇస్తూ రెచ్చిపోయింది. ముఖానికి మాస్క్ పెట్టుకుని తన‌ను ఎవ‌రూ చూడ‌టం లేదు అన్న‌ట్టు ప్రియుడి మ‌త్తులో మునిగిపోయింది. ఈ వ్య‌వ‌హారాన్ని అంతా బైక్ వెన‌కాల వెళుతున్న వ్య‌క్తి వీడియో తీయ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. రోడ్డుపైనే ఇలాంటి ప‌నిచేయాలా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ప‌నులు చేస్తున్న‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని, వీళ్ల వ‌ల్ల ప‌క్క‌న వెళ్లే వాహ‌నాల‌కు కూడా ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఫైర్ అవుతున్నారు. వీడియో

Next Story