- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
#ProudRandi : నేను వేశ్యను.. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు #ProudRandi అంటూ కుప్పలు తెప్పలుగా రీల్స్, మీమ్స్ వచ్చేస్తున్నాయి. ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం భారీగా ప్రభావితం చేసింది. చేస్తుంది కూడా. ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, థెరపిస్ట్, ఫెమినిస్ట్ కంటెంట్ క్రియేటర్ అయిన దివిజా భాసిన్ ఈ ఉద్యమాన్ని

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు #ProudRandi అంటూ కుప్పలు తెప్పలుగా రీల్స్, మీమ్స్ వచ్చేస్తున్నాయి. ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం భారీగా ప్రభావితం చేసింది. చేస్తుంది కూడా. ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, థెరపిస్ట్, ఫెమినిస్ట్ కంటెంట్ క్రియేటర్ అయిన దివిజా భాసిన్ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. అనుకోకుండా దారుణంగా పాపులర్ అయిపోయింది. వేశ్య అనే అవమానకరమైన పదాన్ని పిల్లలు, మహిళలు.. ఆమె లాగే తమ ప్రొఫైల్‌కు యాడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. బయోలు, పోస్టుల్లో ఇందుకు సంబంధించిన కంటెంట్‌ను పెట్టేస్తూ గర్వంగా నేను వేశ్యను అని చెప్పుకుంటున్నారు.
అసలు ఇది ఎందుకు మొదలైంది?
సాధారణంగా ఒక మహిళ కొంచెం బోల్డ్‌గా మాట్లాడినా.. కొద్దిగా ఎక్స్‌పోజ్ చేసినా.. క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ అయిపోతుంది. కామెంట్ సెక్షన్ మొత్తం నెగెటివ్ కామెంట్స్‌తో నిండిపోతుంది. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు చాలా మంది మహిళలు ఈ ఆన్‌లైన్ హరాజ్మెంట్ ఎదుర్కొంటున్నారు. వేశ్య, ల**జ అనే కామెంట్స్‌తో కొందరు డిప్రెషన్‌లోకి కూడా వెళ్తున్నారు. ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్న దివిజ భాసిన్.. హరాజ్మెంట్‌కు వ్యతిరేకంగా ఈ పదాన్ని అవమానకరంగా కాకుండా నార్మలైజ్‌గా చూసేలా చేయాలని నిర్ణయించుకుంది. I AM PROUD RANDI అనే యూట్యూబ్ వీడియో ద్వారా ఈ హ్యాష్ ట్యాగ్‌ను యాడ్ చేసింది. ఇందులో ‘వేశ్య(Randi)’ కామెంట్స్ పొందనటువంటి అనుభం గురించి పంచుకుంది. చివరలో‘ ఎస్.. నేను నిజాన్ని అంగీకరిస్తున్నాను. నేను ఒక రండి. ప్రౌడ్ రండి. గుర్తుంచుకోండి #RandiSupremacy’ అంటూ వీడియోను ముగించింది.
ఏం చెప్పాలనుకుంది?
ఈ ఉద్యమం పురుషులు మహిళలపై వాడే బూతులను సాధారణీకరించాలని చెప్పాలనుకుంది దివిజా భాసిన్. స్త్రీలు దీన్ని అవమానంగా భావిస్తే భయపడిపోతారని.. యాక్సెప్ట్ చేస్తే ఆ బాధే ఉండదని చెప్పింది. ‘స్లట్ వాక్’ వంటి ఉద్యమానికి సమానంగా ఉండాలని అనుకుంది. ఈ వీడియో ఫైర్ స్టార్మ్‌లా వ్యాపించింది. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ పోల్చుకున్న వేలాది మంది యూజర్లు.. చిన్న పిల్లలతో సహా తమ ప్రొఫైల్‌లకు #ప్రౌడ్‌రండి యాడ్ చేసుకున్నారు. రీల్స్, స్టోరీలు.. ఫెమినిజం, మానసిక ఆరోగ్యం, స్థిరత్వంపై చర్చలకు దారితీశాయి. వైరల్ క్లిపింగ్స్ మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించాయి.
వ్యతిరేకత.. ఎందుకు?
అయితే మహిళలు చాలా మంది ఈ ప్రౌడ్ రండి కాన్సెప్ట్‌ను యాక్సెప్ట్ చేస్తే వ్యతిరేకత కూడా అంతే పెద్ద మొత్తంలో ఎదురైంది. ఇది చిన్న పిల్లలను తప్పదోవ పట్టిస్తుందని తిట్టిపోస్తున్నారు. 14ఏళ్ల చిన్నారులు దీన్ని స్వీకరించడం ద్వారా వారి భవిష్యత్తుపై ఎంత దారుణమైన ప్రభావం చూపుతుందో తెలుసా అంటూ ఫైర్ అవుతున్నారు. దివిజా భాసిన్‌ప పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెను జైలుకు పంపాలని కోరుతున్నారు. చిన్న పిల్లలను లైంగిక ప్రభావాల నుంచి రక్షించాలని కోరుతున్నారు. అయితే దివిజ మాత్రం ఇన్నాళ్లు రండి అని పిలిచిన పురుషులు.. తాము బయటకొచ్చి మాట్లాడినప్పుడు ఇందుకు వ్యతిరేకంగా గొంతు వినిపించడం హాస్యాస్పదంగా ఉందని కామెంట్ చేసింది.






