Shocking News : పీరియడ్స్ వచ్చాయని వరండాలో కూర్చోబెట్టిన ప్రిన్సిపల్

by Muthe.Rajitha |

తమిళనాడు(Tamilanadu) కోయంబత్తూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

Shocking News : పీరియడ్స్ వచ్చాయని వరండాలో కూర్చోబెట్టిన ప్రిన్సిపల్
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamilanadu) కోయంబత్తూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పీరియడ్స్(Periods) వచ్చాయని ఓ దళిత విద్యార్థినిని ప్రిన్సిపల్ బయట వరండాలో కూర్చోబెట్టి పరీక్ష రాయించింది. కోయంబత్తూర్‌లోని స్వామి చిన్మయానంద మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలికకు తొలిసారి పీరియడ్స్ వచ్చాయి. అయితే రెండవ రోజు నుంచే విద్యార్థినికి వార్షిక పరీక్షలు ఉండటంతో తల్లిదండ్రులు "తీట్టు"(ముట్టు) వంటి ఆచారం ఏమీ పాటించకుండా తమ కూతురును పరీక్షలు రాయడానికి పాఠశాలకు పంపించారు. అయితే అప్పటికే ఆ విషయం స్కూల్లో తెలియడంతో.. మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెడితే మైల పడతారని క్లాస్ రూం బయట కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు స్కూల్ ప్రిన్సిపల్.

ఇదే విషయం బాలిక ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు తెలుపగా.. తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. విద్యాసంస్థ అనుమతులు రద్దు చేసి, విచారణకు ఆదేశించారు. కాగా ప్రిన్సిపల్ అయి ఉండి ఇలా చేయడం ఏమిటని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Next Story