పాత ‘కుక్కర్’ పడేయబుద్ధి కాకపోతే ఇలాగే జరుగుతుంది? కిచెన్‌లో ప్రెజర్ కుక్కర్ బ్లాస్ట్ వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-10-24 11:53:10  IST  )

భారత్‌లో ఎక్కడో చోట చోటుచేసుకున్న ప్రమాదకర ఘటనలు సోషల్ మీడియాలో తరుచుకుగా కన్పిస్తుంటాయి.

పాత ‘కుక్కర్’ పడేయబుద్ధి కాకపోతే ఇలాగే జరుగుతుంది? కిచెన్‌లో ప్రెజర్ కుక్కర్ బ్లాస్ట్ వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో ఎక్కడో చోట చోటుచేసుకున్న ప్రమాదకర ఘటనలు సోషల్ మీడియాలో తరుచుకుగా కన్పిస్తుంటాయి. తాజాగా కిచెన్‌లో (cooking) వంట చేస్తున్న సమయంలో ప్రెజర్ కుక్కర్ (Pressure cooker) పేలుడు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కిచెన్‌లో పని చేస్తూ ఉన్న మహిళ వంట మధ్యలో కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయింది. వీడియోలో, ఆమె కొద్ది సెకన్ల ముందు అక్కడి నుండి పక్కకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. వంట చేస్తుండగా కుక్కర్ బ్లాస్ట్ అవ్వడంతో కిచెన్‌ సామాన్లు చెల్లచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

అదృష్టం బాగుంది, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని, కుక్కర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్‌లు కామెంట్లు చేశారు. ప్రెజర్ కుక్కర్ పేలుళ్లు చాలా ప్రమాదకరమైనవని, వంట సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని యూజర్లు సూచించారు. పాత కుక్కర్‌లు పడేయబుద్ది కాకపోతే ఇలాగే జరుగుతుందని, మూడు నాలుగు ఏళ్లు వాడాక సేఫ్ సైడ్ కోసం కుక్కర్ చేంజ్ చేయడం బెస్ట్ అని శ్రీనివాస్ అనే ఎక్స్ యూజర్ వీడియో పోస్ట్ చేసి తన అభిప్రాయం తెలిపారు. ఈ కామెంట్‌పై పలువురు యూజర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

పాత కుక్కర్.. కొత్త కుక్కర్ అని తేడా ఉండదని, కొన్ని క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ వల్ల అనర్థాలు జరుగుతాయని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కుక్కర్ బ్లాస్ట్ విజిల్ సమస్య వల్ల అవుతుందని, తాము పదిహేను ఏళ్ల నుంచి పాత కుక్కర్ వాడుతున్నామని, కుక్కర్ ఆపరేటర్ పర్ఫెక్ట్ తెలియకపోతే ప్రమాదకరమని, అందుకే ఆటో మెటిక్ కుక్కర్ వాడటం బెటర్ అని మరో యూజర్ కామెంట్ చేశారు. కుక్కర్‌లో ఆహారం అధికంగా నింపకూడదు, సేఫ్టీ వాల్వ్ సరిగా ఉందో లేదో తరచుగా తనిఖీ చేయాలి, అలాగే స్టీమ్ విడుదలైన తర్వాత మాత్రమే మూత తీసుకోవాలని ప్రెజర్ కుక్కర్ వాడే వారికి నిపుణులు సూచించారు. వీడియో ఇదే..

Next Story