- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UK cancer patient: వైద్య చరిత్రలోనే అద్భుతం.. రెండు సార్లు ఒకే బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి!
యూకే (UK)లో వైద్య చరిత్రలోనే అద్భుత ఘటన తాాజాగా వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: యూకే (UK)లో వైద్య చరిత్రలోనే అద్భుత ఘటన తాాజాగా వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్ కారణంగా బిడ్డకు ఓ గర్భిణి రెండు సార్లు (Pregnant woman gives birth twice) జన్మనిచ్చింది. అవును మీరు విన్నది నిజమే. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన (Lucy) లూసీ ఇసాక్ (32) ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. 2024లో ఆమె గర్భం దాల్చారు. ఆమె 20 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో 2024 అక్టోబర్‌లో ఆస్పత్రికి వెళ్లి అల్ట్రా సౌండ్ చేయించుకున్నారు. టెస్టుల్లో ఆమెకు అండాశయ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. దీంతో కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరుగకుండా హై-రిస్క్ ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు.
జాన్ రాడ్‌క్లిప్ హాస్పిటల్‌లో డాక్టర్ హూమన్ సోలేమాని మజ్ద్, అతని బృందం ఈ కేసును చాలెంజింగ్ తీసుకున్నారు. సర్జరీ సమయంలో ముందుగా ఆమె కడుపులో ఉన్న గర్భాన్ని తాత్కాలికంగా తొలగించి.. గర్భాన్ని ఓ సెలైన్ ప్యాక్‌లో భద్ర పరిచారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి సెలైన్ ప్యాక్‌ను మార్చుతూ.. ఉష్ణోగ్రతల మధ్య గర్భాన్ని ఉంచారు. ఈ విధంగా దాదాపు రెండు గంటల పాటు గర్భిణి కడుపు బయట గర్భాన్ని ఉంచారు. అదేవిధంగా లూసీకి ఐదు గంటల పాటు ఆపరేషన్ ప్రక్రియ కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు సర్జరీ నిర్వహించి క్యాన్సర్ కణితులను తొలగించారు. సర్జరీ సక్సెస్ అయిన అనంతరం బయటకు తీసిన గర్భాన్ని మళ్లీ గర్భాశయంలోకి అమర్చారు. లూసీతో పాటు ఆమెకు పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ప్రమాదం కలగకుండా డాక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక నెలలు నిండిన లూసీ ఈ ఏడాది జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో రెండు సార్లు బిడ్డకు జన్మనిచ్చినట్లైంది. లూసీకి 20 వారాల గర్భం అప్పుడే తాత్కాలికంగా గర్భాన్ని బయటకు తీసీ.. మళ్లీ నెలలు నిండిన తర్వాత బిడ్డకు ఆరోగ్యంగా జన్మనిచ్చింది. ఆ బాబుకి రాఫెర్టీ ఇసాక్ అని దంపతులు పేరు పెట్టారు. కాగా, తాజాగా లూసీ, ఆమె భర్త కలిసి జాన్ రాడ్‌క్లిప్ హాస్పిటల్‌కు వెళ్లి వైద్య బృందాన్ని కలిసి థ్యాంక్స్ చెప్పారు. దీంతో ఓ డాక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేను అతన్ని ఇంతకు ముందు కలిసినట్లు అనిపించిందని, 15 మంది వైద్య బృందం కలిసి ఐదు గంటల పాటు సంచలనాత్మక శస్త్రచికిత్స నిర్వహించామని డాక్టర్ మజీద్ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. అయితే గర్భధారణ సమయంలో క్యాన్సర్ రోగికి పిండాన్ని తాత్కాలికంగా తొలగించి మళ్లీ అమర్చడం చాలా అరుదని డాక్టర్లు చెబుతున్నారు.






