- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓరి మీ దుంపలు తెగ.. చచ్చిపోయారనుకున్నాంగా!
సోషల్ మీడియాలో ఓ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఉన్న వధూవరులు చనిపోయారని చూసి నెటిజన్లు షాకయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లంటే నూరేళ్ల పంట.. కానీ ఇప్పుడు పెళ్లంటే అర్థమే మారిపోయింది. పెళ్లంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు, అవి తెచ్చే తంటాలు అన్నట్లు తయారైంది పరిస్థితి. చాలాకాలంగా పెళ్లి చేసుకోబోయే జంటలు ముందుగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవడం షరా మామూలైపోయింది. సరే.. నేటితరం యువత ఇలాంటివాటిని ఫాలో అవ్వడంలో తప్పు లేదు. కానీ.. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మంచి లొకేషన్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటే తప్పులేదు. ప్రాణాలమీదికి వస్తుందని తెలిసి కూడా రైల్వే ట్రాక్స్, బీచ్ మధ్యలో, హిల్ ఏరియాల్లో ఫొటోల కోసం, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ షూటింగ్స్ కోసం వెళ్లి ప్రాణాలమీదికి తెచ్చుకున్నంత పనిచేస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ అవుతోంది. మొదటి అది చూసినవారంతా కొత్తజంట చనిపోయారేమోనని భావించి అయ్యోపాపం అనుకుంటున్నారు. కానీ అదంతా ఫొటోల కోసం వచ్చిన తంటాలని తెలిసి .. పొట్టు పొట్టు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. "ఓరి మీ దుంపలు తెగ.. చచ్చిపోయారనుకున్నాంగా!" అని కొందరు.. పిచ్చి పరాకాష్టకు చేరడం అంటే ఇదేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఫస్ట్ నైట్ వీడియోలు కూడా తీయించుకోండంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోలో కాబోయే వరుడు, వధువు నీటిలో పడుకుని కళ్లు మూసుకుని కనిపిస్తారు. తర్వాత కెమెరాన్ మెన్ ఫొటోలు తీస్తుండటం కనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్లు ఇదెక్కడి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ మండిపడుతున్నారు.






