- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీచర్‌పై ప్రాంక్.. 22 మంది విద్యార్థులు సస్పెండ్.. వైరల్ వీడియో
దక్షిణాఫ్రికా స్కూల్స్ యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయుల పట్ల తీవ్రంగా ప్రవర్తిస్తే సస్పెన్షన్ తప్పదు. ఈ క్రమంలోనే ఓ స్కూల్ టీచర్‌పై ప్రాంక్ చేసినందుకు 22 మంది విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. పాజ్ చాలెంజ్‌లో భాగంగా

దిశ, ఫీచర్స్ : దక్షిణాఫ్రికా స్కూల్స్ యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయుల పట్ల తీవ్రంగా ప్రవర్తిస్తే సస్పెన్షన్ తప్పదు. ఈ క్రమంలోనే ఓ స్కూల్ టీచర్‌పై ప్రాంక్ చేసినందుకు 22 మంది విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. పాజ్ చాలెంజ్‌లో భాగంగా విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్‌లో అలాగే ఉండిపోయి గురువును భయపెట్టారు. దీంతో షాక్ అయిన ఆమె.. ఏం చేయాలో పాలుపోక అలాగే నిల్చుండిపోయింది. దీంతో తనను భయపెట్టారని ఫిర్యాదు చేయడంతో క్లాస్ మొత్తంపై వేటు పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు.
అసలు విద్యార్థులు చేసిన పనిలో మిస్టేక్ ఏముందని అడుగుతున్నారు నెటిజన్లు. జస్ట్ ప్రాంక్ చేసినందుకు.. అది కూడా టీచర్‌ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చేయడంతో ఫన్ జనరేట్ అయిందే తప్ప నెగెటివిటీ ఏం లేదన్నారు. స్కూల్ బిల్డింగ్స్ తగలబెడితే పర్లేదు కానీ ఇలా క్రియేటివ్ ప్రాంక్స్ చేయకూడదు కదా అని కొందరు సెటైర్స్ వేస్తుంటే ఇంకొందరు ఆ విద్యార్థుల యూనిటీని కొనియాడుతున్నారు.






