- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్‌డే సెలబ్రేషన్స్ ముసుగులో.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఫ్రెండ్స్
స్నేహితుడి పుట్టినరోజు.. కేక్ కట్ చేద్దామని పిలిచిన ఐదుగురు స్నేహితులు.. ఈ సర్‌ప్రైజ్‌తో బయటకొచ్చిన అతనిపై కోడి గుడ్లు, రాళ్లు విసిరారు.. పుట్టినరోజు ప్రాంక్ అని చెప్పారు.. ఆ తర్వాత స్కూటర్‌లో దాచిన పెట్రోల్ తీసి అతనిపై పోయగా..

X
దిశ, వెబ్ డెస్క్ : స్నేహితుడి పుట్టినరోజు.. కేక్ కట్ చేద్దామని పిలిచిన ఐదుగురు స్నేహితులు.. ఈ సర్‌ప్రైజ్‌తో బయటకొచ్చిన అతనిపై కోడి గుడ్లు, రాళ్లు విసిరారు.. పుట్టినరోజు ప్రాంక్ అని చెప్పారు.. ఆ తర్వాత స్కూటర్‌లో దాచిన పెట్రోల్ తీసి అతనిపై పోయగా.. మరొకరు లైటర్ వెలిగించారు.. దీంతో బట్టలకు నిప్పంటుకోగా.. భయంతో అరుస్తూ పరుగెత్తాడు. వెంటనే అతన్ని స్థానికులు, కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ముంబైలో ఈ ఘటన జరగ్గా.. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రాంక్ కాస్తా ఫెయిల్ అయి ప్రమాదకరంగా మారిందని పోలీసులు చెప్తుంగా.. కుటుంబీకులు మాత్రం పూర్వ వైరమే ఈ ప్రీ ప్లాన్డ్ దాడికి కారణమని ఆరోపిస్తున్నారు.
Next Story






