- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓట్ల కోసం ఇంటికొచ్చిన నాయకులు.. టీవీ సీరియల్ యాడ్స్ తగ్గించమని కోరిన బామ్మ..
భారతదేశంలో టీవీ సీరియల్స్‌కు ఫిదా అయిపోయి.. టీవీలకు అతుక్కుపోయి.. డిస్టర్బెన్స్ జరిగితే గొడవలు పడిపోయి.. ఒక్కోసారి కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆడాళ్లు టీవీ

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో టీవీ సీరియల్స్‌కు ఫిదా అయిపోయి.. టీవీలకు అతుక్కుపోయి.. డిస్టర్బెన్స్ జరిగితే గొడవలు పడిపోయి.. ఒక్కోసారి కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆడాళ్లు టీవీ సీరియల్స్‌ను ఓన్ చేసుకుని.. ఆ సీరియల్ చూసే టైంలో కుటుంబ సభ్యుల్లో ఎవరు డిస్టర్బ్ చేసినా.. ఫట్టుమని ఒక్కటి వేసేందుకు కూడా వెనుకాడరు.
అయితే బిహార్‌కు చెందిన ఓ బామ్మ.. తన టీవీ సీరియల్స్‌కు యాడ్స్ ఎలా అడ్డుపడుతున్నాయో.. ఓట్ల కోసం వచ్చిన నాయకులకు చెప్పింది. ఎన్‌సీపీకి చెందిన ఎంపీ సుప్రియా సూలే పూణే రస్తా పేఠ ప్రాంతంలో ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఇక్కడ ఓ బామ్మ.. 30 నిమిషాలు టీవీ సీరియల్ ఉంటే ఇందులో 20 నిమిషాలు యాడ్స్ వస్తాయని.. కథ చూడటానికి ఏం లేదని.. దయచేసి ఈ సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చేయమని కోరింది. ఆమె ప్రాబ్లమ్‌ను చక్కగా విన్న ఎంపీ.. ఏదో ఒకటి చేస్తామని హామీ ఇచ్చింది.






