- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా అండర్‌వేర్ కొట్టేసిన పోలీస్.. ఇదెక్కడి చోద్యం.. (వీడియో)
సోషల్ మీడియాలో వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇలాంటిదే ఈ వీడియో కూడా. నార్మల్‌గా దొంగలు చోరీ చేస్తే పోలీసులు పట్టుకోవాలి. కానీ ఇక్కడ పోలీస్ చోరీ చేశాడు. అది కూడా ఓ మహిళ అండర్‌వేర్ కొట్టేశాడు. అందుకే ఈ క్లిపింగ్ వైరల్ అవుతుంది.

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇలాంటిదే ఈ వీడియో కూడా. నార్మల్‌గా దొంగలు చోరీ చేస్తే పోలీసులు పట్టుకోవాలి. కానీ ఇక్కడ పోలీస్ చోరీ చేశాడు. అది కూడా ఓ మహిళ అండర్‌వేర్ కొట్టేశాడు. అందుకే ఈ క్లిపింగ్ వైరల్ అవుతుంది. 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఘటనకు 2025లో కోర్టు జడ్జ్‌మెంట్ ఇవ్వగా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
గతేడాది సెప్టెంబర్ 12న ఓ కేసు విచారణ మీద ఓ మహిళ ఇంటిని సోదా చేయాల్సి వచ్చింది పోలీసు అధికారి. డ్యూటీలో భాగంగా హెర్ట్‌ఫోర్డ్‌షైర్ కాన్స్టాబులరీ అధికారి మార్సిన్ జీలిన్స్కీ తనిఖీలు చేశాడు. కానీ అనుకోని విధంగా నేరానికి పాల్పడ్డాడు. ఆ ఇంటిలో డ్రెసింగ్ టేబుల్‌లో సోదా చేసిన ఆయన.. పింక్ కలర్ అండర్ వేర్ దొంగతనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో రింగ్ కెమెరాలో రికార్డ్ కాగా తప్పు చేసినట్లు అంగీకరించాడు. నవంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కాగా ఈ ఏడాది ఆగస్టు 4న కేంబ్రిడ్జ్ క్రౌన్ కోర్టు నిందితునికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. ఇక తన ప్రైవసీకి ఇబ్బంది కలగడం వల్ల తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిపింది బాధితురాలు లీ-ఆన్. ఈ ఘటనను పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ద్రోహంగా భావిస్తున్నట్లు తెలిపింది.






