‘ప్లీజ్.. ఒక్కసారి చూడు డాడీ.. లే డాడీ! కన్నీరు పెట్టిస్తున్న కూతురి ఆర్తనాదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-06 06:28:37  IST  )

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో అకాల వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. పంటను కాపాడుకోబోయి రేకుల షెడ్డు కూలి నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.

‘ప్లీజ్.. ఒక్కసారి చూడు డాడీ.. లే డాడీ! కన్నీరు పెట్టిస్తున్న కూతురి ఆర్తనాదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతి సృష్టించిన కల్లోలం కొందరి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అకాల వర్షం నుంచి తన పంటను కాపాడుకోవాలని వెళ్లిన ఓ తండ్రి, శవమై తిరిగిరావడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. మంచిర్యాల (Manchiryal) జిల్లా లక్షెట్టిపేట (Lakshettipeta)లో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికులను, నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. మంచిర్యాల జిల్లాలో లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలలు బీభత్సం సృష్టించాయి. రైతులు తమ వడ్లు వర్షానికి తడవకుండా కాపాడుకునేందుకు కల్లాల వద్దకు పరుగులు తీశారు. అనంతరం పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి వెళ్లి నిలబడగా.. బలమైన గాలులకు అది కుప్పకూలింది. దీంతో నలుగురు రైతులు తీవ్ర గాయాలతో మృతిచెందారు.

ఓ ఆడబిడ్డ రోదనలు...

రైతుల భౌతికకాయాలను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఓ కూతురు తన తండ్రిని విగతజీవిగా చూసి గుండలవిసేలా రోదించింది. ‘ప్లీజ్.. ఒక్కసారి చూడు డాడీ.. లే డాడీ!’ అంటూ ఆ చిన్నారి తన తండ్రిని లేపడానికి ప్రయత్నించిన తీరుతో ఆసుపత్రి ప్రాంగణమంతా నిశ్శబ్దం అలముకుంది. ప్రస్తుతం అందుక సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story