పంచాయతీ ఎన్నికల్లో చిత్రం.. సర్పంచ్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు సున్నా

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

పంచాయతీ ఎన్నికల్లో చిత్రం.. సర్పంచ్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు సున్నా
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థులు ఎక్కని గడప లేదు అన్నట్లుగా ప్రచారం నిర్వహించారు. కొన్ని కొట్ల మద్యం ఏరులై పారగా.. మరికొన్నిచోట్ల డబ్బు ప్రభావం పని చేసింది. ఈ క్రమంలోనే మూడు విడత పంచాయతీ ఎన్నికల్లో ఓ చిత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ (Warangal0 జిల్లా ఖానాపూర్ (Kahanapur) మండల పరిధిలోని కీర్యా‌తండా (Keeryatanda)లో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. గ్రామంలో మొత్తం 239 ఓట్లు పోల్ అవ్వగా బీజేపీ (BJP) బలపరిచిన అభ్యర్థి బోడ గౌతమి (Boda Gautami)కి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. అదేవిధంగా మరో ఇద్దరు అభ్యర్థులు బాదావతు లలితకు 79 ఓట్లు, బోడ విజయకు 156 ఓట్లు వచ్చాయి. నోటాకు ఒక ఓటు పడింది. 3 ఓట్లు చెల్లుబాటు కాలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, సర్పంచ్ అభ్యర్థి బోడ గౌతమికి ఒక్క ఓటుకు పడకపోవడం పట్ల ఆమె ఓటును ఆమె వేసుకోలేదా అని అటు గ్రామస్థులు.. చిత్రం చూసిన ప్రజలు నోళ్లు వెళ్లబెడుతున్నారు.

Next Story