- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ కొరత...ఓపిక లేక, ఏకంగా బైక్ ట్యాంక్ ఎత్తుకొచ్చేశాడు
బైక్ తీసుకువచ్చే ఓపిక లేక ఏకంగా టాంకర్ ఎత్తుకొని వచ్చాడు ఓ వాహనదారుడు.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో వాహనదారుల క్యూ లైన్లు గత మూడు రోజుల నుంచి కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మన ఇండియాలో చమురు కొరత ఏర్పడింది. పెట్రోల్ గురించి టెన్షన్ పడకూడదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నేపథ్యంలో బంకులకు ఎగబడి వెళ్తున్నారు జనాలు. క్యూ లైన్ లో గంటల తరబడి ఉండి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంకుల దగ్గర రకరకాల సిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా తన బైక్ తీసుకువచ్చే ఓపిక లేక ఏకంగా టాంకర్ ఎత్తుకొని వచ్చాడు ఓ వాహనదారుడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. క్యూలైన్ లో నిలబడే ఓపిక లేక, ఓ వాహనదారుడు అదిరిపోయే ప్లాన్ వేశాడు. తన బైక్ టాంకర్ తొలగించి, బంక్ దగ్గరకు తీసుకువచ్చాడు. క్యూ లైన్ లో బైక్ లేకుండానే నిలబడి, ట్యాంకర్ లో పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఆ తర్వాత హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు. బైక్ తీసుకువచ్చి, క్యూలైన్ లో నిలబడే ఓపిక లేక ఈ ప్లాన్ వేశాడు సదరు వాహనదారుడు. ఈ సంఘటన హైదరాబాద్ లోనే జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన జనాలు, తాము కూడా అదే పని చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. బైక్స్ తీసుకువచ్చి ట్రాఫిక్ జామ్ చేయడం కంటే, ట్యాంకర్లు తీసుకురావడం బెటర్ అంటున్నారు. క్లిక్






