Viral video: అంబులెన్స్‌ను చేతులతో బోల్తా కొట్టించిన ప్రజలు.. బెంగళూరులో ఘటన.. ఎందుకంటే..?

by Ramesh Naini |   (  Updated:2025-11-02 08:58:51  IST  )

బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

Viral video: అంబులెన్స్‌ను చేతులతో బోల్తా కొట్టించిన ప్రజలు.. బెంగళూరులో ఘటన.. ఎందుకంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Bengaluru) బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. వేగంగా వచ్చిన అంబులెన్స్ నియంత్రణ కోల్పోయి రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న పలు బైక్‌లను డీకొట్టింది. ఈ ప్రమాదంలో 40 ఏళ్ల ఇస్మాయిల్, అతని భార్య సమీన్ బాను ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

వారు స్కూటర్ నడుపుతుండగా అంబులెన్స్ వారిని ఢీకొట్టింది. ఆ తర్వాత అంబులెన్స్ స్కూటర్‌ను చాలా మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లి.. ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఘటన అనంతరం చాలా మంది స్థానికులు, ఇతర వాహనదారులు అంబులెన్స్‌ను తమ చేతులతోనే ఎత్తి బోల్తా కొట్టించారు. విల్సన్ గార్డెన్ ట్రాఫిక్ పోలీసులు అశోక్‌ అనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, స్థానికులు, ఇతర వాహనదారులు అంబులెన్స్‌ను తమ చేతులతోనే ఎత్తి బోల్తా కొట్టించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని నెటిజన్‌లు కామెంట్ పెట్టారు. వీడియో ఇదే..

Next Story