- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పెద్ది’ మానియా స్టార్ట్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వీడియోలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘పెద్ది’(Peddi).

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘పెద్ది’(Peddi). ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్(Sukumar writings), రిద్ది సినిమాస్(Riddi Cinemas) బ్యానర్స్ పై భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ మూవీలో స్టార్ యాక్టర్ జగపతిబాబు(Jagapathi Babu), శివన్న(Shivanna) కీ రోల్ ప్లే చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కనిపించాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ది మానియా స్టార్ట్ అయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రామ్ చరణ్ బ్యాట్‌ను నేలకు కొట్టి బంతిని గట్టిగా బాదిన షార్ట్‌ను అందరూ ట్రై చేస్తూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






