Big Breaking: కవిగా మారిన పవర్ స్టార్.. కవిత అదుర్స్..

by Disha Web Desk 3 |
Big Breaking: కవిగా మారిన పవర్ స్టార్.. కవిత అదుర్స్..
X

దిశ వెబ్ డెస్క్: అభిమానుల ఆరాధ్య దైవం, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలియని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రజల ఆదరణ అభిమానం సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. కాగా ఈ రోజు బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలకు శుభాకాంక్షలు తెలియ చేస్తూ X వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చేసి గంట కూడా దాటలేదు అప్పుడే ఆ పోస్ట్ వేళల్లో వ్యూస్ ని కైవసం చేసుకుంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముంది అనేగా మీ సందేహం. ఆ పోస్ట్ లో బాలికలు ఎలా ఉండాలో వర్ణిస్తూ పవన్ కళ్యాణ్ ఓ కవిత రాసారు.

కంటికి రూపమై, ఇంటికి దీపమై, చమురై కరుగుతూ, సగమై కదులుతూ, జగమై వెలుగుతూ, జగతిని నడుపుతూ, చైతన్యం నింపుతూ, వర్ధిల్లాలి వందేళ్లు, వెలుగొందాలి వెయ్యేళ్ళు అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. మీరు ఆ పోస్ట్ ను ఒక సారి చూసేయండి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కలిసి రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం అందరికి సుపరిచితమే. అయితే పార్టీలకు పొత్తులు కుదిరినంత సులువుగా సీట్ల విషయంలో పొత్తులు కుదరడం లేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న అభ్యర్థులను ప్రకటించకుండా ఇరు పార్టీ అధినేతలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. దీనితో సీట్ల కేటాయింపు విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


Next Story

Most Viewed