- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేషెంట్‌తో కలిసి హాస్పిటల్‌లో మందుకొట్టిన బంధువులు (వీడియో)
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో పేషెంట్‌తో కలిసి బంధువులు మందు కొట్టారు. హెల్త్ కేర్ వర్కర్ చెప్పినా వినకుండా తమ ఎంజాయ్ తాము చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో పేషెంట్‌తో కలిసి బంధువులు మందు కొట్టారు. హెల్త్ కేర్ వర్కర్ చెప్పినా వినకుండా తమ ఎంజాయ్ తాము చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి నియమాలను ఉల్లంఘించడమే కాదు ఇతర రోగులకు ఇబ్బంది కలుగజేస్తున్నారని తిట్టిపోస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. దేవేంద్ర యాదవ్ అనే వ్యక్తి సర్జికల్ వార్డులో రోగిగా చేరాడు. ఆయనను చూసేందుకు వచ్చిన బంధువులు ఇద్దరు.. మద్యం బాటిల్స్, గ్లాసులు, స్టఫ్ పట్టుకుని దర్శనమిచ్చారు. దర్జాగా పేషెంట్ పక్కన కూర్చుని.. మందు కొట్టడం స్టార్ట్ చేశారు. హెల్త్ కేర్ ఆఫీసర్ గాయత్రి చౌదరి ఈ విషయాన్ని వ్యతిరేకించింది. బంధువులతో కలిసి ఇక్కడ మందుకొట్టేందుకు ఎంత ధైర్యమని ప్రశ్నించినా వినిపించుకోలేదు. నో ఆల్కహాల్ పాలసీని పట్టించుకోకుండా నచ్చినట్లు చేశారు. దీంతో కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.






