- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంతకు తెగించార్రా...ఏకంగా ట్రైన్ బాత్రూంలోనే బీర్లు పెట్టి !
ట్రైన్ బాత్రూంలో బీర్లు పెట్టి, దొంగచాటున తరలిస్తోన్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని వింత సంఘటనలు కూడా ఉంటాయి. అయితే తాజాగా ట్రైన్ బాత్రూంలో బీర్లు తరలించిన సంఘటన వైరల్ గా మారింది. ఈ దారుణమైన సంఘటన గంగా దామోదర్ ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్ లోని ధన్ బాద్ ప్రాంతం నుంచి నిత్యం పాట్నాకు గంగా దామోదర్ ఎక్స్ ప్రెస్ నడుస్తుంది. అయితే ఈ ట్రైన్ లో చాలా మంది బీహార్ కు వెళ్తూ ఉంటారు. వాస్తవంగా బీహార్ లో కంటే జార్ఖండ్ లో మద్యం ధరలు తక్కువగా ఉంటాయట.
అలాగే కల్తీ లేని మద్యం దొరుకుతుందని సమాచారం. దీంతో చాలామంది బీహార్ మందుబాబులు... ఈ ట్రైన్ ద్వారా బీర్లు, లిక్కర్ బాటిల్స్ అక్రమంగా తరలిస్తుంటారు. ఈ క్రమంలోనే గంగా దామోదర్ ఎక్స్ ప్రెస్ లో ఏకంగా బాత్రూం సీలింగ్ లో బీర్లను దాచారు స్మగ్లర్లు. జార్ఖండ్ నుంచి పాట్నా తరలించే ప్రయత్నం చేశారు. అయితే అనుమానం వచ్చిన నేపథ్యంలో రైల్వే పోలీసులు చెక్ చేశారు. దీంతో అసలు రంగు బయటపడింది. వాష్ రూమ్ లో ఉన్న సీలింగ్ ఓపెన్ చేసి చూడగానే పదుల సంఖ్యలో బీర్లు వెలుగు చూశాయి. ఇక ఈ సంఘటన నేపథ్యంలో అక్రమ మద్యం తరలిస్తున్న ముఠాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... విచారణ చేపట్టారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.






