- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెమటలు కక్కుతున్న ప్రయాణికుడు.. ఇది విమానమా? ప్యాసింజర్ ఆటోనా? నెటిజన్ల సెటైర్
వేసవి(Summer) వచ్చిందంటే చాలు.. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు వేడిగాలులతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: వేసవి(Summer) వచ్చిందంటే చాలు.. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు వేడిగాలులతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బైకు, ఆటోపై ప్రయాణాలు చేస్తే ఎంత నరకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెమటలతో రోడ్డు మీదే స్నానం చేసినంత పని అవుతుంది. అయితే.. ఇంతటి ఎండల్లో విమానంలో జర్నీ ఎంత సుఖంగా ఉంటుందో ప్రయాణించిన వారందరికీ తెలిసే ఉంటుంది. చల్లగా ఏసీ.. గాల్లో విహారం భలే మజాగా ఉంటుంది.
కానీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూస్తే ఫ్లైట్ ఎక్కాలన్నా భయపడటం ఖాయం. ఇటీవల ఢిల్లీ నుంచి పాట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం(Air India Flight)లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ఏసీ పనిచేయలేదు. ఈ క్రమంలో అటు గాలి లేక, ఇటు ఏసీ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ కావడంతో అది ప్యాసింజర్ ఆటోనా? లేక విమానమా? అంటూ కామెంట్స్ చేశారు. ఇలాంటివి ఎయిర్ ఇండియాలో తరచూ జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.
ఎయిర్ ఇండియాలో ఉక్కపోత.
— greatandhra (@greatandhranews) May 19, 2025
ఢిల్లీ నుంచి పట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో గాలి లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ఇలాంటివి ఎయిర్ ఇండియాలో తరచూ జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. #AirIndia pic.twitter.com/SMlStXUAMw






