Viral Video:ఆకస్మాత్తుగా బస్సు ఆపి.. ఆ పని కానిచ్చేసిన ఆర్టీసీ డ్రైవర్.. బిత్తరపోయిన ప్రయాణికులు!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

Viral Video:ఆకస్మాత్తుగా బస్సు ఆపి.. ఆ పని కానిచ్చేసిన ఆర్టీసీ డ్రైవర్.. బిత్తరపోయిన ప్రయాణికులు!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నడి రోడ్డు పై బస్సు ఆపి నమాజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బస్సులో ప్రయాణికులు డ్రైవర్ నమాజ్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రజెంట్ నెట్టింట తీవ్ర చర్చలు దారితీస్తుంది. కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో మంగళవారం(ఏప్రిల్ 29) సాయంత్రం హుబ్లీ-హవేరి మార్గంలోని జవేరి సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఆర్టీసీ డ్రైవర్(RTC Bus Driver) రోడ్డుపై ఆకస్మాత్తుగా బస్సు నిలిపివేసి.. ప్రయాణికుల సీటు పై కూర్చొని నమాజ్ చేశారు. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా బిత్తరపోయారు. షాకైన ప్రయాణికులు డ్రైవర్ ప్రార్థనలు పూర్తయ్యే వరకు నిస్సహాయంగా వేచి చూడాల్సి వచ్చింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ(RTC) మేనేజర్‌కు లేఖ రాశారు.

ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని ఆచరించే హక్కు ఉంది, కానీ విధి నిర్వహణ సమయంలో కాకుండా ఇతర సమయాల్లో చేసుకోవాలి. బస్సులో ప్రయాణికులు ఉన్నప్పుడు మార్గమధ్యలో బస్సు ఆపి నమాజ్ చేయడం అభ్యంతరకరం’’ అని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి డ్రైవర్ తప్పు చేసినట్లు తేలితే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమా(Social Media)ల్లో వైరల్ అవుతుంది.

వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ https://x.com/AngrySaffron/status/1917578202685276405చేయండి.

Next Story