జైలులో మందు, విందు, చిందు.. ఖైదీలకు పార్టీ ఇచ్చిందెవరో తెలిస్తే షాకే..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-14 13:52:37  IST  )

బెంగళూరు పరప్పన అగ్రహారా సెంట్రల్ జైలు కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఐసిస్ ఉగ్రవాది, సీరియల్ రేపిస్ట్ అండ్ కిల్లర్, హై ప్రొఫైల్ ప్రిజనర్లకు వీఐపీ ట్రీట్మెంట్‌కు సంబంధించిన వీడియోలతో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ వీడియోలు ట్రెండింగ్‌లో ఉండగా.. తాజాగా ఈ జైలుకు సంబంధించిన

జైలులో మందు, విందు, చిందు.. ఖైదీలకు పార్టీ ఇచ్చిందెవరో తెలిస్తే షాకే..
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరు పరప్పన అగ్రహారా సెంట్రల్ జైలు కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఐసిస్ ఉగ్రవాది, సీరియల్ రేపిస్ట్ అండ్ కిల్లర్, హై ప్రొఫైల్ ప్రిజనర్లకు వీఐపీ ట్రీట్మెంట్‌కు సంబంధించిన వీడియోలతో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ వీడియోలు ట్రెండింగ్‌లో ఉండగా.. తాజాగా ఈ జైలుకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మందు, స్నాక్స్, విందు, డ్యాన్స్ పార్టీలతో ఖైదీలు హాయిగా ఎంజాయ్ చేస్తున్న వీడియో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఓ వైపు మందు తాగుతూ మరో వైపు డ్యాన్స్‌లు వేస్తూ నేరస్తులు జైలులో ఎంజాయ్ చేస్తుంటే వీరి కారణంగా బాధపడుతున్న వారు బయట మరింత బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కర్ణాటక హోమ్ మినిస్టర్ జి. పరమేశ్వర అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. హై సెక్యూరిటీ ఉన్న జైలులోకి మద్యం, స్నాక్స్ ఎలా ఎంటరయ్యాయని ప్రశ్నించారు. టాప్ జైలు అధికారిని ట్రాన్స్‌ఫర్ చేశారు. పోలీసులు ఇప్పటికే బిగ్ యాక్షన్‌కు ప్రామిస్ చేశారు.

Next Story